Megastar Chiranjeevi: అది చిరంజీవికి మాత్రమే.. మరోకరికి ఛాన్స్ లేదు !

Megastar Chiranjeevi: అది చిరంజీవికి మాత్రమే.. మరోకరికి ఛాన్స్ లేదు !
x
Chiranjeevi And Regina
Highlights

రెజీనా 'శివ మనసులో శ్రుతి(SMS)' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన పిల్లానువ్వులేని జీవితం సినిమాతో మంచి సక్సెస్ వచ్చింది.

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజాగా చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో హీరోయిన్ రెజీనా కస్సాండ్రా ఓ ఐటెం సాంగ్‌లో కనిపించనుంది. దీంతో ఈ స్పెషల్ సాంగ్ గురించి రెజీనా స్పందించింది. తన కెరీర్ లో ఈ మూవీలో చెస్తున్న సాంగ్ ఫస్ట్ , చివరి సాంగ్ అని తెలిపింది. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ.. " ఆచార్య సినిమాలో చిరంజీవిగారితో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో చేశాను. అది ఐటెం సాంగ్ కాదు. సెలబ్రేషన్ సాంగ్ అంటే బాగుంటుంది. ఇదే నా సినిమా కెరీర్‌లో ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్. ఆచార్య టీం నాకు ఫోన్‌చేసి ఈ సినిమాలో ప్రత్యేకమైన సాంగ్ ఉంది చేస్తారా? అని అడిగినప్పుడు మరో క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ఓకే చేసేసాను' అని చెప్పింది ఈ అమ్మడు.

చిరంజీవిగారి పక్కన అంటే డ్యాన్స్ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలన్నారు. అయితే మరో స్పెషల్ సాంగ్ చేయాలంటే ఒప్పుకోను అని చెప్పేశారు. ఆచార్య సినిమాలో రెజీనా చేసిన ఈ పాటను రాత్రి వేళల్లోనే చిత్రీకరించారు. రెజీనా 'శివ మనసులో శ్రుతి(SMS)' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన పిల్లానువ్వులేని జీవితం సినిమాతో మంచి సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేసుకుంటుపోతుంది. గత ఏడాది ఎవరు సినిమాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె 'నేనేనా' అనే సినిమాలో నటిస్తున్నారు.

చిరంజీవి నటిస్తున్న చిత్రం కావడంతో ఆచార్య సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం రెజీనా ఆరు రోజులు కాల్‌షీట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. చిరంజీవి త్రిష కలిసి నటిస్తున్న రెండో చిత్రం కావడం విశేషం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లోనే స్టాలిన్ చిత్రం కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఆచార్య సినిమాకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మింస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories