Regina Cassandra: ఆ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయా.? రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు

Regina Cassandra Opens Up About Losing Bollywood Opportunities Due to Language Barrier
x

Regina Cassandra: ఆ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయా.? రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు

Highlights

Regina Cassandra: అందం, అభినయం ఉన్నా సరైన అవకాశాలు అందుకోవడంలో వెనకబడిన నటీమణుల్లో అందాల తార రెజీనా ఒకరు.

Regina Cassandra: అందం, అభినయం ఉన్నా సరైన అవకాశాలు అందుకోవడంలో వెనకబడిన నటీమణుల్లో అందాల తార రెజీనా ఒకరు. 2012లో వచ్చిన శివ మనసులో శృతి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించే అవకాశం అందుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి.

సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, ఎవరు తప్ప తెలుగులో పెద్దగా విజయాలు దక్కలేవు. అయితే అదే సమయంలో తమిళంలో కూడా పలు అవకాశాలు దక్కించుకుందీ చిన్నది. కాగా ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇండస్ట్రీకి పరిచయమైన సుమారు 14 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది రెజీనా. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ చిన్నది. భాష కారణంగా తాను బాలీవుడ్‌లో పలు చిత్రాలను వదులు కోవాల్సి వచ్చిందని తెలిపింది.

ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ.. 9 సంవత్సరాల వయసు నుంచి నటించడం ప్రారంభించానని. 25 ఏళ్లుగా ఎన్నో సినిమాలు, ప్రకటనల్లో నటించానని, అందుకే తనకు ఇండస్ట్రీ మీద అవగాహన ఉందని చెప్పుకొచ్చింది. ఇక పరిశ్రమలో నటిగా ఉండడం.. ముఖ్యంగా బాలీవుడ్‌లో దక్షిణాది నటిగా కొనసాగడం చాలా కష్టమని తెలిపిన రెజీనా.. హిందీ సినిమా కోసం ఆడిషన్‌ ఇచ్చినప్పుడు ఆ భాష మాట్లాడగలనో, లేదో అని చూశారన్నారు.

అయితే దక్షిణాది సినిమా పరిశ్రమలో ఈ విషయాన్ని పట్టించుకోరని, ఏ భాషకు చెందినవారినైనా ఎంపిక చేసుకుంటారన్నారు. అందుకే కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో ఇతర భాషలకు చెందిన ఎంతోమంది నటీనటులు అగ్ర తారలుగా ఎదిగారన్న రెజీనా.. హిందీ సరిగ్గా మాట్లాడలేకపోయినందున ఎన్నో అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది. 'నేను పంజాబీ అమ్మాయిగా నటించలేను. కానీ, ఒక పంజాబీ అమ్మాయి మాత్రం దక్షిణాది నటిగా చేయగలదు. నా విషయంలో అదే జరిగింది. నార్త్‌లో నటిస్తున్న హీరోయిన్‌లే సౌత్‌ ఇండియన్‌ సినిమాల్లోనూ నటిస్తున్నారు’ అని రెజీనా తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories