అబ్బాయిలు.. మ్యాగీ రెండూ రెండు నిమిషాలే.. మ‌గ‌వాళ్ల‌పై రెజీనా డ‌బుల్ మీనింగ్ జోక్‌..

Regina Cassandra  Joke In Shakini Dakini Movie promotions
x

అబ్బాయిలు.. మ్యాగీ రెండూ రెండు నిమిషాలే.. మ‌గ‌వాళ్ల‌పై రెజీనా డ‌బుల్ మీనింగ్ జోక్‌.. 

Highlights

*"శాకినీ డాకిని" ప్రమోషన్స్ లో రెజినా అడల్ట్ జోక్

Regina Cassandra: రెజీనా కసాండ్రా మరియు నివేద థామస్ హీరోయిన్లుగా నటించిన "శాకిని డాకిని" అనే సినిమా త్వరలోనే సెప్టెంబర్ 16న థియేటర్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సౌత్ కొరియాలో సూపర్ హిట్ అయిన "మిడ్ నైట్ రన్నర్స్" అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ వారు గురు ఫిలిమ్స్ మరియు క్రాస్ పిక్చర్స్ వారితో సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో లో మాట్లాడుతూ రెజీనా కసాండ్రా ఒక అడల్ట్ జోక్ వేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారుతుంది. ఇలాంటి జోకులు వేయచ్చో లేదో తెలీదు అంటూనే ఒక జోక్ చెబుతున్నాను అని మొదలుపెట్టింది రెజీనా. "అబ్బాయిలు మ్యాగీ ఇద్దరు ఒకటే. రెండూ రెండు నిమిషాల్లో అయిపోతాయి" అంటూ అడల్ట్ జోకు పేల్చింది రెజీనా.

పక్కనే ఉన్న నివేదా థామస్ మాత్రం ఎక్స్ప్రెషన్ మార్చకుండా అదే చిరునవ్వుతో ఉండగా యాంకర్ మాత్రం షాక్ అయ్యారు. కెమెరా ముందు మాట్లాడుతూ రెజినా ఇలాంటి అడల్ట్ జోకులు వేయటం తో అభిమానులు సైతం షాకయ్యారు. అభిమానులు మాత్రం రెజినా నాకు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఈమె కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే అలా మాట్లాడిందని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories