ఫాహాధ్ ఫాసిల్ ను పుష్ప ప్రమోషన్స్ కి అందుకే ఇన్వైట్ చేయలేదంటా...!

Reason for Fahadh Faasil not Attending to Pushpa Movie Promotions | Tollywood News
x

ఫాహాధ్ ఫాసిల్ ను పుష్ప ప్రమోషన్స్ కి అందుకే ఇన్వైట్ చేయలేదంటా...!

Highlights

Fahadh Faasil - Pushpa Movie: "పుష్ప: ది రైజ్" ఈ మధ్యనే విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను నమోదు చేసుకుంటోంది...

Fahadh Faasil - Pushpa Movie: అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్" ఈ మధ్యనే విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను నమోదు చేసుకుంటోంది. అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఫాహాధ్ ఫాసిల్ విలన్ పాత్రలో కనిపించారు. కానీ పుష్ప సినిమా సెకండ్ పార్ట్ గా విడుదల కాబోతున్న "పుష్ప: ది రూల్" సినిమాలో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించబోతున్నారు. అయితే చిత్ర బృందం ప్రమోషన్స్ తో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక, దేవి శ్రీ ప్రసాద్, సునీల్ తదితరులు చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన ఫాహాధ్ ఫాసిల్ మాత్రం ప్రమోషన్ రావడం లేదు.కనీసం ఈ సినిమాకి సంబంధించిన ఒక్క ఈవెంట్ లో కూడా ఫాహాధ్ ఫాసిల్ హాజరు కాకపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

అయితే దీనికి కారణాలు లేకపోలేదు. ఫాహాధ్ ఫాసిల్ మలయాళంలో పెద్ద స్టార్ హీరో. ఆయన ప్రమోషన్స్ కు హాజరు కావాలంటే దానికి తగ్గట్టుగానే భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే కావాలని చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారు ఫాహాధ్ ఫాసిల్ ను ప్రమోషన్స్ కి పిలవలేదని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories