Sonu Sood birthday: సినిమాలు తగ్గించినా.. తరగని సంపద.. రియల్ హీరో సంపాదన ఎంతో తెలుసా ?

Sonu Sood birthday
x

Sonu Sood birthday: సినిమాలు తగ్గించినా.. తరగని సంపద.. రియల్ హీరో సంపాదన ఎంతో తెలుసా ?

Highlights

Sonu Sood birthday: 2020లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పుడు ఎంతో మంది ప్రజలు ఒకరికొకరు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారిలో బాలీవుడ్ నటుడు సోను సూద్ పేరు ముందు వరుసలో ఉంటుంది.

Sonu Sood birthday: 2020లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పుడు ఎంతో మంది ప్రజలు ఒకరికొకరు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారిలో బాలీవుడ్ నటుడు సోను సూద్ పేరు ముందు వరుసలో ఉంటుంది. కరోనా సమయంలో లెక్కలేనన్ని మందికి సహాయం చేసి, ఆయన రియల్ లైఫ్ హీరోగా మారిపోయారు. ఈరోజు సోను సూద్ పుట్టినరోజు. 52 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన కేవలం నటుడిగానే కాదు, సినిమా నిర్మాతగా, మోడల్‌గా, సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్‎గా కూడా రాణిస్తున్నారు.

సోను సూద్ ఇప్పటివరకు అనేక సినిమాల్లో కీలక పాత్రలు పోషించి అభిమానులను అలరించారు. ముఖ్యంగా, ఆయన విలన్ పాత్రలతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు. సినిమాల్లో విలన్‌గా కనిపించిన ఆయన కరోనా సమయంలో మాత్రం రియల్ హీరోగా నిలిచారు. 1999లో నటనారంగంలోకి అడుగుపెట్టిన సోను సూద్ కెరీర్ దక్షిణాది సినిమా ఇండస్ట్రీ నుంచే మొదలైంది. ఆయన తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో కూడా నటించారు. కన్నడలో సుదీప్‌తో కలిసి నటించిన 'విష్ణువర్ధన్' సినిమాలో 'ఆదిశేష' పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే తెలుగులో అరుంధతి సినిమాలోని పశుపతి పాత్ర కెరీర్లో తనకు ది బెస్ట్ గా నిలచింది.

2024 నాటికి సోను సూద్ మొత్తం ఆస్తి 140 కోట్ల రూపాయలు. ఈ నటుడు ప్రతి నెలా కోటి రూపాయలకు పైగా సంపాదిస్తాడు. అంటే, ఏడాదికి 12 కోట్ల రూపాయలకు పైగా ఆయన ఆదాయం ఉంటుంది. సోను సూద్ కేవలం సినిమాల నుంచే కాకుండా, ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నారు. సోను సూద్ ముంబైలో ఒక లగ్జరీ ఇంటిని కలిగి ఉన్నారు. అందులో నాలుగు బెడ్ రూమ్స్, ఒక హాల్ ఉన్నాయి. తన కుటుంబంతో కలిసి ఆయన ఈ ఇంట్లోనే నివసిస్తున్నారు. నటుడికి ముంబైలోని జుహులో సొంత హోటల్ కూడా ఉంది. దీని ద్వారా కూడా ఆయనకు మంచి ఆదాయం వస్తుంది. అంతేకాదు, ఆయన వద్ద అనేక ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.

సోను సూద్ 1996లో సోనాలిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అయాన్, ఇషాంత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నటుడు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. యాక్టింగ్ తగ్గించినా, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, వ్యాపార రంగంలో రాణిస్తూ సోను సూద్ తన ఆస్తులను, సంపాదనను పెంచుకుంటూనే ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories