Janhvi Kapoor: బర్త్ డే స్పెషల్.. RC16 నుంచి జాన్వీ పోస్టర్.. చేతిలో గొర్రె పిల్లతో అదిరిపోయింది

Rc16 Team Birthday Wishes to Janhvi Kapoor Poster Viral
x

బర్త్ డే స్పెషల్.. RC16 నుంచి జాన్వీ పోస్టర్.. చేతిలో గొర్రె పిల్లతో అదిరిపోయింది

Highlights

ఇవాళ జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపింది. మూవీలోని ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

Janhvi Kapoor: జాన్వీకపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. శ్రీదేవి, బోనీకపూర్ ముద్దుల కూతురిగా దఢఖ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన జాన్వీ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగారు. గత ఏడాది దేవర సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా ఆర్సీ16లో నటిస్తున్నారు. అయితే ఇవాళ జాన్వీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవాళ జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపింది. మూవీలోని ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో జాన్వీ కపూర్ ఒక చేత్తో మేకపిల్లను ఎత్తుకోగా.. మరోచేత్తో గడ్డి మొక్కను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కేక అంటూ బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

జాన్వీ కపూర్ సినిమాల కంటే కూడా తన గ్లామర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్‌లో కనిపిస్తూ అందరి మనస్సులను దోచుకుంటారు. గత ఏడాది దేవర సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీ.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత రామ్ చరణ్‌ ఆర్సీ16 సినిమాలో ఛాన్స్ కొట్టేశారు.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆర్సీ16. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. గేమ్ ఛేంజర్‌తో నిరాశపరిచిన రామ్ చరణ్ ఈ మూవీతో అదరగొట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ న్యూ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం. ఇక ఆర్సీ 16ను దీపావళి నాటికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories