Ray Bradbury Fahrenhiet Burning Book:'ఫారెన్‌హీట్‌ 451'పుస్తకం.. చదవాలంటే కాల్చాల్సిందే

Ray Bradbury Fahrenhiet Burning Book:ఫారెన్‌హీట్‌ 451పుస్తకం.. చదవాలంటే కాల్చాల్సిందే
x
Highlights

Ray Bradbury Fahrenhiet Burning Book: ఏ పుస్తకం చదవాలన్న ఆ భాష మనకి అర్ధం అయితే సరిపోతుంది. దానిని చదువుతాం..మన మనసుకు హత్తుకునేలా పదాలు ఉంటే మళ్లీ...

Ray Bradbury Fahrenhiet Burning Book: ఏ పుస్తకం చదవాలన్న ఆ భాష మనకి అర్ధం అయితే సరిపోతుంది. దానిని చదువుతాం..మన మనసుకు హత్తుకునేలా పదాలు ఉంటే మళ్లీ మళ్లీ చదువుతాం. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని మన అలమరలో పెట్టుకుంటాం. కానీ ఓ బుక్ అలా కాదు.. దానిని చదవాలంటే కాల్చాలి.. పుస్తకాన్ని కాలిస్తే ఏమవుతుంది? బూడిద మిగులుతుంది. అంటారా కాదు.. ఇక్కడ చెప్పుకోబోయే పుస్తకంలోని పేజీలను చదవాలంటే కచ్చితంగా వాటిని కాల్చాలి. ఎందుకంటే నిప్పు తగలనిదే ఆ పుస్తకంలోని అక్షరాలు కనిపించవు.

ఆ పుస్తకమే ప్రముఖ అమెరికన్‌ రచయిత రే బ్రాడ్‌బురీ రాసిన '' ఫారెన్‌హీట్‌ 451''. 'ఫారెన్‌హీట్‌ 451' లోని పేజీలు మొత్తం నల్లటి వర్ణంలో ఉంటాయి. వాటిని చదవాలంటే కచ్చితంగా నిప్పును తాకించి తీరాలి. కాగితాలపై నిప్పు తగలగానే ఆ పుస్తకంపై ఉన్న నల్లటి రంగు మాయమై అక్షరాలు ప్రత్యక్షమవుతాయి. సైన్స్‌ గర్ల్‌ ( science girl) అనే ట్విటర్‌ యూజర్‌ దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్‌ అకౌంట్ లో షేర్‌ చేసింది. దీంతో ఆ వీడియో కాస్తా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ''ఈ బుక్ చాలా అద్భుతం మంత్ర, తంత్రాల పుస్తకంలా ఉంది... ఇది ఓ మాయా పుస్తకం దీనిని నిప్పు అంటిస్తెనే చదవగలం'' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పుస్తకం గురించి ఇప్పుడు అందరూ నేట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ బుక్ ను ఒక్క సారైనా చూడాలని ఆసక్తికనబరుస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories