Raviteja Krack: మూడు రోజుల్లో ఆహాలో క్రాక్.. ఆగ్రహంతో ఫ్యాన్స్..

Raviteja Krack:  మూడు రోజుల్లో ఆహాలో క్రాక్.. ఆగ్రహంతో ఫ్యాన్స్..
x

క్రాక్ , అహ 

Highlights

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన 'క్రాక్' మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై విజయం సాధించింది.

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన 'క్రాక్' మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై విజయం సాధించింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు మంచి కమ్ బ్యాక్ సినిమా అయ్యింది. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజకు మంచి హిట్ దొరికింది. కరోనాతో 50 శాతం ఆక్యుపెన్సీలోనే 30 కోట్ల రూపాయలపైగా ఈ సినిమా వసూలు చేసింది. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హౌజ్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.

ఈ చిత్రాన్ని జనవరి 29న 'ఆహా' ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే దీనిపై కొందరు రవితేజ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఒప్పందం జరిగిందని 3 వారల తర్వా ఈ సినిమాను విడుదల చేస్తున్నామని ఆహా చెబుతోంది. ఆహా స్ట్రీమింగ్ సంస్థ క్రాక్ సినిమాను రూ. 8.2 కోట్లకు కొనుక్కున్నదని టాక్. ‎

క్రాక్ సినిమా రవితేజకు 'క్రాక్' పూర్వ వైభవం తెచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్ మలినేని దర్శకుడు. ఎన్నో అడ్డంకుల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ హిట్ దిశగా ముందుగు సాగుతోంది. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. గతంలో 'బలుపు, డాన్ శీను' లాంటి హిట్ చిత్రాల తర్వాత గోపిచంద్, రవితేజ కాంబినేషన్ వచ్చి మరో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రన్ని బి.మధు నిర్మించారు. థమన్ బాణీలు కట్టాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories