Raviteja Khiladi: అమెజాన్ ప్రైమ్ లో రవితేజ ఖిలాడి...ఎప్పుడో తెలుసా

Raviteja Khiladi to Stream on Amazon Prime
x

Raviteja Khiladi:(File Image)

Highlights

Raviteja Khiladi: ఈ సినిమా ముందుగా థియేటర్లలోనే విడుదల.. ఆ తరువాతే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

Raviteja Khiladi: కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఒకవేళ ఇప్పట్లో తెరుచుకున్నా.. ప్రేక్షకులు ధైర్యం చేసి సినిమా హాళ్లకు వస్తారా అనేది ప్రశ్న. ఈ క్రమంలోనే అనేక సినిమాలు ఓటీటీవైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే తెలుగు నుంచి అనేక చిత్రాలు డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా ప్రేక్షకులను పలకరించాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత ఖిలాడి అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు ఓటీటీ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది.

రవితేజ సినిమా ఖిలాడి ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయ్యిందని సమాచారం. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమేజాన్‌ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని దక్కించుకుంది. అమెజాన్ దాదాపు 6 కోట్లపైగా ధర చెల్లించి ఈసినిమా డిజిటల్ రైట్స్‌ను కొన్నట్లు టాక్. ఇక్కడ కండీషన్ ఏమంటే ఈ సినిమా ముందుగా థియేటర్లలోనే విడుదల అవుతుంది. ఆ తరవాతే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అంటే పోస్ట్ థియేటర్ రన్ తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఇక ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో విడుదల కావాల్సింది. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు మళ్లీ తెరచుకుంటే.. ముందుకొచ్చే సినిమాల్లో ఖిలాడి ముందు వరుసలో ఉండనుంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓ టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తిస్తుందని సమాచారం. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇలా ఉండగానే రవితేజ మరోసినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. నక్కిన త్రినాధ్ రావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories