'డిస్కో రాజా' టీజర్ 2.0 వచ్చేసింది.

డిస్కో రాజా టీజర్ 2.0 వచ్చేసింది.
x
Highlights

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజకి మంచి హిట్టు అయితే పడలేదు.

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజకి మంచి హిట్టు అయితే పడలేదు. ఆ తర్వాత చేసిన టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో ఓ కొత్త కథతో డిస్కో రాజా అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి ఎక్కడికి పోతావ్ చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్‌ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా అనే సినిమాని చేస్తున్నాడు.

ఈ సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ , టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విడుదల తేది దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరును పెంచేసింది. అందులో భాగంగానే మరో టీజర్ ని బయటకు వదిలింది.

ఒక నిమిషం ఆరు సేకన్లు ఉన్న ఈ టీజర్ సినిమాపైన మరిన్ని అంచనాలను పెంచేసింది. " సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబులతోనూ, ఫైరింగ్స్ తోను యుద్దాలు చేసి రిటైర్ అయి ఇంట్లో ఉంటే సడన్ గా వచ్చే సైలెన్స్ ఉంటుంది చూడు అది అప్పటిదాకా వాళ్ళు చూసిన వైలెన్స్ కంటే భయకరంగా ఉంటుంది అన్న డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఇక చివరగా రవితేజ చెప్పే డైలాగ్ తో ముగుస్తుంది. ఈ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత తనతో డాన్‌ శ్రీను, బలుపు సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించానున్నాడు. రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories