డిస్కోరాజా రెండో రోజు కలెక్షన్ రిపోర్ట్

డిస్కోరాజా రెండో రోజు కలెక్షన్ రిపోర్ట్
x
disco raja
Highlights

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన సినిమా డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఈ నెల 24న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకొంది.

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన సినిమా డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఈ నెల 24న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకొంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజైన ఈ సినిమా మొదటిరోజు 3.5 కోట్ల కోట్ల షేర్ ను రాబట్టిదని తెలుస్తోంది. మహేష్‌ బాబు, అల్లు అర్జున్, సినిమాలతో పోటీపడి ఓ రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో రవితేజ డిస్కోరాజా సినిమా జోష్ కనబరుస్తుంది. ఉత్తరాంధ్రలో రెండో రోజు కాసులు బాగానే రాబట్టాడు. డిస్కోరాజా 22 లక్షల షేర్ రాబట్టి, అల వైకుంఠపురంలో.., సరిలేరు నీకెవ్వరు చిత్రాల సరసన నిలిచింది. అల.. వైకుంఠపురములో సినిమాకు 35 లక్షల సేర్ వస్తే.. సరిలేరు నీకెవ్వరు సినిమాకు 24.6 లక్షల షేర్ వచ్చింది. డిస్కోరాజా ఓవర్సీస్‌లోనూ మంచి ఓపెనింగ్స్‌తో సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది .

విడుదలకి ముందు ఈ చిత్రం రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తోంది.. ఇక ఓవర్సీస్, ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో కలుపుకుని రూ. రూ.3.1 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. రవితేజ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించారు . ఇందులో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ , నభా నటేష్ నటించారు. తమన్ సంగీతం అందించగా, రామ్ తాళ్లూరి సినిమాని నిర్మించారు. బాబీ సింహ ప్రధాన పాత్రలో నటించాడు. సినిమాకి మంచి టాక్ రావడంతో చిత్ర యూనిట్ నిన్న హైదరాబాదులో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఇక ఈ సినిమా తర్వాత తనతో డాన్‌ శ్రీను, బలుపు సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories