దిల్ రాజ్ సంస్థలో రవిబాబు ?

దిల్ రాజ్ సంస్థలో రవిబాబు ?
x
Highlights

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతగా దిల్ రాజుకి టాలీవుడ్ లో మంచి పేరుంది . అయన సంస్థ నుండి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉంటాయి...

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతగా దిల్ రాజుకి టాలీవుడ్ లో మంచి పేరుంది . అయన సంస్థ నుండి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉంటాయి . చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ కొత్త దర్శకులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ పెద్ద పెద్ద హిట్లు కొట్టారు అయన . ఇక అక్కడి నుండి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే చిన్నచిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు . తాజాగా దిల్ రాజు బ్యానర్ లో రవిబాబు ఆవిరి అనే సినిమా చేస్తున్నాడని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది . అనసూయ , నువ్విలా , అవును లాంటి విభిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నారు రవిబాబు . కానీ భారీ భారీ కమర్షియల్ సక్సెస్‌లను మాత్రం సాధించలేకపోతున్నారు. అయితే అయన దిల్ రాజు బ్యానర్ లో కొత్త వాళ్ళతో ఈ సినిమాని తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది . దీనిపైన మరింత క్లారిటీ రావాల్సి ఉంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories