ఆ నటితో నేను చాట్ చేయలేదు: రవిబాబు

ఆ నటితో నేను చాట్ చేయలేదు: రవిబాబు
x
Highlights

దర్శకుడిగా విభిన్నమైన సినిమాలు తీస్తూ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు రవిబాబు... ప్రస్తుతం ఆవిరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు....

దర్శకుడిగా విభిన్నమైన సినిమాలు తీస్తూ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు రవిబాబు... ప్రస్తుతం ఆవిరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవిబాబు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అందులో భాగంగా రవిబాబు ఓ నటితో చాటింగ్ చేసి వేధించాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన స్పందించిన రవిబాబు తనకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ లేవని చెప్పుకొచ్చాడు.

ఎవరో నా పేరు మీదా ఫేక్ ఎకౌంటు క్రియేట్ చేసి చాట్ చేసాడని , కానీ ఇది నేనే చేసినట్టే సోషల్ మీడియాలో ప్రచారం చేసారని చెప్పుకొచ్చాడు. ఈ విషయం నాకు తెలియదని కానీ నా అసిస్టెంట్ ఫోన్ చేసి ఈ విషయం చెబుతూ వెబ్ సైట్స్ లింక్స్ పంపించడంతో ఈ విషయం తెలిసిందని అన్నాడు.

అయితే ఈ ఘటన 2012లో జరిగిందని చెప్పుకొచ్చారు. ఆ నటి 'నువ్విలా' సినిమాలో ఓ చిన్న పాత్ర చేసిందట. ఇలా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి కానీ ఎందుకు అని ఊరుకున్నాను అని అన్నారు. నా విషయంలో లాగే నా తండ్రి విషయంలోను ఇలాగే జరిగిందని చెప్పుకొచ్చాడు రవిబాబు.. సినిమా టెక్నాలజీ పెరగడం మంచిది కానీ సోషల్ మీడియా మంచిది కాదని చెప్పుకొచ్చాడు రవిబాబు. నాకంటూ ఇన్స్టాగ్రామ్ తప్ప మరేమీ లేదని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories