ఆ పాత్ర ఉదయ్ కిరణ్ చేస్తా అన్నాడు కానీ తర్వాత ...

ఆ పాత్ర ఉదయ్ కిరణ్ చేస్తా అన్నాడు కానీ తర్వాత ...
x
Highlights

వైవిధ్యమైన కథలో తీయడంలో రవిబాబు మంచి స్పెషలిస్ట్ అని చెప్పాలి.. ఇప్పటివరకు అయన నుండి వచ్చిన సినిమాలు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాయి..అందులో భాగంగానే...

వైవిధ్యమైన కథలో తీయడంలో రవిబాబు మంచి స్పెషలిస్ట్ అని చెప్పాలి.. ఇప్పటివరకు అయన నుండి వచ్చిన సినిమాలు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాయి..అందులో భాగంగానే 2005 లో తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్స్ గా 'సోగ్గాడు' అనే సినిమాని తీశారు రవిబాబు... సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించింది. రవిబాబుకి ఇది దర్శకుడి గా మూడో సినిమా.. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూ లో రవిబాబు మాట్లాడుతూ .. "ఈ సినిమాలోని చందు అనే పాత్రలో ముందుగా హీరో ఉదయ్ కిరణ్ చేయాల్సి ఉంది. ఆ పాత్ర గురించి ఆయనకి చెప్పాను. ముందుగా ఒకే చెప్పకుండా నన్ను డైలమాలో పెట్టాడు. ఆ తర్వాత చేస్తానని చెప్పాడు. తీరా కథ అంతా అయ్యాకా నేను చేయను అన్నాడు. దీనితో కొంచం నేను ఆవేశంలో నిర్ణయం తీసుకోని ఆ పాత్రకి వేరే ఆర్టిస్టుని తీసుకున్నాను నేను నా జీవితంలో చేసిన మొదటి తప్పు అదే... ఇక మళ్లీ ఎప్పుడు అలాంటి తప్పులు చేయలేదని చెప్పుకొచ్చాడు రవిబాబు"... ఆ సినిమాలో చందు అనే పాత్రని బాలీవుడ్ నటుడు జుగల్ హన్సరాజ్ చేసాడు.. సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories