ఖిలాడీ ఈవెంట్లకు దూరంగా ఉంటున్న రవితేజ

Ravi Teja Staying Away From Khiladi Events
x

ఖిలాడీ ఈవెంట్లకు దూరంగా ఉంటున్న రవితేజ 

Highlights

Khiladi Event: ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్ అయితే దాని కోసం సక్సెస్ మీట్లు పెట్టి సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Khiladi Event: ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్ అయితే దాని కోసం సక్సెస్ మీట్లు పెట్టి సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాగే కొందరు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా సక్సెస్ మీట్లు పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రమేష్ వర్మ మరియు కోనేరు సత్యనారాయణ కలిసి రవితేజ హీరోగా నటించిన "ఖిలాడీ" సినిమా సక్సెస్ ఈవెంట్ ను ప్రజల ఒపీనియన్ తో పనిలేకుండా విడుదల రోజే ప్లాన్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవలేదు. విడుదలైన రోజు నుంచి ప్రేక్షకులు నుంచి ఈ సినిమా నెగిటివ్ టాక్ ని మాత్రమే అందుకుంది.

కానీ రమేష్ వర్మ మరియు రవితేజ ల మధ్య గొడవలు ఉన్నాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్త. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రవితేజ రమేష్ వర్మ గురించి మాట్లాడలేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో రమేష్ వర్మ భార్య రవితేజ ను చీప్ స్టార్ అంటూ కామెంట్లు చేశారు. దీంతో "ఖిలాడీ" కి సంబంధించిన ఏ ఈవెంట్ లోనూ హాజరు కాకూడదని రవితేజ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సక్సెస్ ఈవెంట్ కి కూడా రవి తేజా రాలేదు. డింపుల్ హయాతీ మరియు మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అర్జున్ సర్జా మరియు ఉన్ని ముకుందన్ ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories