logo
సినిమా

Ravi Teja: "ఖిలాడి" దర్శక నిర్మాతలపై ఫైర్ అవుతోన్న రవితేజ

Ravi Teja on Fire Over Khiladi Filmmakers | Tollywood News
X

Ravi Teja: "ఖిలాడి" దర్శక నిర్మాతలపై ఫైర్ అవుతోన్న రవితేజ 

Highlights

Ravi Teja: దర్శక నిర్మాతల వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న మాస్ మహారాజా

Ravi Teja: ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఇప్పుడు "ఖిలాడి" సినిమా తో బిజీగా ఉన్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరీలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ఈవెంట్ లో మాట్లాడిన రవితేజని డైరెక్టర్ మరియు నిర్మాతపై ఫైర్ అవుతున్నట్లు అనిపిస్తోంది. నిజానికి ఇలాంటి వేడుకలలో దర్శకుడి గురించి హీరోలు బోలెడు విషయాలు చెప్తారు.

కానీ రమేష్ వర్మ గురించి రవితేజ పెద్దగా ఏమీ చెప్పలేదు. ఇక నిర్మాత గురించి కూడా మాట్లాడుతూ అప్పుడప్పుడు సెట్స్ కి వచ్చి షూటింగ్ చూస్తే చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చని, అందుకే నిర్మాతలకి కుదిరినప్పుడల్లా షూటింగ్ సెట్స్ కి రమ్మని తాను అడిగినట్లుగా రవితేజ అన్నారు. అయితే చిత్ర డైరెక్టర్ మరియు నిర్మాతపై రవితేజ ఫైర్ అవ్వడానికి కారణం వారిద్దరు సినిమా షూటింగ్ నీ సాగదీయడం అని తెలుస్తోంది. ఎప్పుడో గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే దర్శక నిర్మాతలపై రవితేజ కోపంగా ఉన్నట్లు అందుకే చిత్ర వేడుకలో ముభావంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Web TitleRavi Teja on Fire Over Khiladi Filmmakers | Tollywood News
Next Story