హాట్ టాపిక్ గా మారిన రవితేజ సినిమా డైలాగులు

Ravi Teja Movie Dialogues Have Become a Hot Topic
x

హాట్ టాపిక్ గా మారిన రవితేజ సినిమా డైలాగులు

Highlights

Ravi Teja: రవితేజ కావాలనే ఇలాంటి డైలాగులు చెబుతున్నారా?

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాకగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన వాడు. మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో నటుడయ్యాడు. ఆ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటుడాయన. నేచురల్ స్టార్ నాని.. విజయ్ దేవరకొండ లాంటి వారికి రవితేజ ఇనిస్పేరేషన్. అతన్ని స్పూర్తిగా తీసుకునే ఇండస్ర్టీలో ఎదిగారు ఇద్దరు. అటుపై రవితేజ...నాని..దేవరకొండ ముగ్గురు నేటి జనరేషన్ కి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పరిచయం అక్కర్లేని పేరు అది. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ హీరోగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. రవితేజ సిని ప్రస్థానం ఇప్పుడు ఎంతో మంది హీరోలకు ఒక ఇన్స్పిరేషన్. ఇండస్ట్రీకి వచ్చినా కొత్తల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సినిమాపై తనకి ఉన్న ప్రేమ ఇప్పుడు రవితేజని ఒక స్టార్ గా మార్చింది. ఎందరికో రోల్ మోడల్ గా నిలిచేలా చేసింది. అయితే గత కొంతకాలంగా రవితేజ మళ్ళీ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు రవితేజ తన సినిమాలలో తనని తాను వ్యక్తిగతంగా ప్రాజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

చెప్పడానికి అవి సినిమాలో ఆ సీన్ కి సింక్ అయ్యే డైలాగులు అయినప్పటికీ నెపోటిజం మీద తగులుతున్నట్లుగా కొందరి అభిప్రాయం. సినిమాలో విలన్లతో మాట్లాడుతూ తాను సొంతంగా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన వాడిని అని అంటూ క్రాక్ లో బ్యాక్ గ్రౌండ్ మాట వినిపిస్తే విలన్లను చితకబాదటం, రామారావు ఆన్ డ్యూటీ, బెంగాల్ టైగర్ లలో సైతం ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ మీద వచ్చే పంచ్ డైలాగ్ లు వింటూనే ఉన్నాం. తాజాగా "ధమాకా" లో కూడా "వెనకున్న వాళ్లను చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్.. వెనక ఎవడు లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని" అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ లు నేపోటిజం మీద రవితేజ కావాలని చేస్తున్న కామెంట్లు అని కొందరు చెబుతున్నారు. దీంతో రవితేజ సినిమా డైలాగులు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories