రవితేజ విషయంలో నిరాశ చెందుతున్న నిర్మాత

Ravi Teja Making Changes to the Rama Rao on Duty Movie | Tollywood News
x

రవితేజ విషయంలో నిరాశ చెందుతున్న నిర్మాత

Highlights

*రవితేజ విషయంలో నిరాశ చెందుతున్న నిర్మాత

Ravi Teja: ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో మంచి ఫాంలోకి వచ్చిన రవితేజ "ఖిలాడి" సినిమా తో పర్వాలేదనిపించారు తాజాగా ఇప్పుడు "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రజిషా విజయన్ మరియు దివ్యాంశ కౌశిక్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేస్తున్నామని ప్రకటించిన చిత్రబృందం ఆ తరువాత మళ్ళీ సోషల్ మీడియాలో కానరాలేదు. శరత్ మండవ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ సినిమా లోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారట. "టైగర్ నాగేశ్వరరావు" సినిమా షూటింగ్ సమయంలో తన మోకాలికి దెబ్బ తగిలినప్పటికీ రవితేజ మళ్లీ "రామారావు ఆన్ డ్యూటీ" షూటింగ్ కోసం సెట్స్ కి వచ్చేశారు. ప్రస్తుతం రీషూట్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత మాత్రం నిరాశ చెందుతున్నట్లు తెలుస్తోంది.

సినిమా ఫైనల్ ఎడిట్ అంతగా బాగోలేదని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పూర్తయి పోయాక రవితేజ ఈ సినిమా లోని 20 శాతం సన్నివేశాలను రీషూట్ చేయమని చెప్పటం తో బడ్జెట్ కూడా బాగా పెరిగిపోతోందని నిర్మాత కంగారు పడుతున్నట్లు సమాచారం. అయితే బడ్జెట్ తో పాటు సినిమా అవుట్ పుట్ కూడా దృష్టిలో పెట్టుకోవడం మంచిది అని అప్పుడే సినిమా హిట్ అవుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories