Khiladi Review: చిత్రం: ఖిలాడి

Ravi Teja Khiladi Movie Review
x

Khiladi Review: చిత్రం: ఖిలాడి

నటీనటులు: రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి, అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు

నిర్మాతలు: సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ

దర్శకత్వం: రమేష్ వర్మ

బ్యానర్: పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్

విడుదల తేది: 11/02/2021

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇప్పుడు అదే జోరుతో వరుసగా సినిమాలు లైన్ లో పెట్టిన రవితేజ తాజాగా ఇప్పుడు "ఖిలాడి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాక్షసుడు సినిమా తో మంచి హిట్ అందుకున్న రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరీలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ కు ఊహించిన స్థాయిలో ఆదరణ లభించలేదు కానీ మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఇవ్వాళ అనగా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా..

కథ:

ఒక రాజకీయ నాయకుడు ప్రస్తుతం ఉన్న హోంమినిస్టర్ ని ముఖ్యమంత్రి గా చేయడం కోసం ఇటలీ నుంచి 2 వేల కోట్ల రూపాయలను తీసుకుంటాడు. కానీ ఒక సామాన్యుడు గాంధీ (రవితేజ) ఆ రాజకీయ నాయకుడి కి అడ్డుగా మారతాడు. అసలు గాంధీ ఎవరు? అసలు సిబిఐ గాంధీ వెనక ఎందుకు పడుతుంది? తన కుటుంబాన్ని గాంధీ కాపాడుకోగలిగాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

సినిమా మొత్తం మీద రవితేజ నటన పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. తన స్టైల్ తో ప్రేక్షకులను రవితేజ చాలా బాగా ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలతో పోలిస్తే రవితేజ ఈ సినిమాలో ఒక సరికొత్త పాత్రలో కనిపించారు. తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. డింపుల్ హాయాతి, మీనాక్షి చౌదరి ఇద్దరికీ సినిమాల్లో మంచి పాత్రలు లభించాయి. ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర లు దక్కాయి. తమ పాత్రలకి వారిద్దరూ పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. సీనియర్ హీరో అర్జున్ సర్జా నటన ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. సిబిఐ ఆఫీసర్ పాత్రలో అర్జున్ చాలా బాగా నటించారు. ఉన్ని ముకుందన్ రావు రమేష్ సచిన్ ఖేడేకర్ ముఖేష్ రుషి కూడా తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగానే వర్కౌట్ అయింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

"వీర" సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి రమేష్ వర్మ మరియు రవితేజ కాంబినేషన్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన అప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించ లేదనే చెప్పుకోవాలి. రమేష్ వర్మ టేకింగ్ ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోతే లేకపోవడం అభిమానులు సైతం నిరాశకు గురి చేసింది. రమేష్ వర్మ నెరేషన్ చాలా స్లోగా ఉండడంతో ప్రేక్షకులకి ఈ సినిమా పై ఆసక్తి మొదట్లోనే తగ్గిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. ఒకటి రెండు పాటలు బాగానే అనిపించాయి. నేపధ్య సంగీతం కూడా సినిమాకి బాగానే సెట్ అయింది. జీకే విష్ణు మరియు సుజిత్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. నిర్మాతలు సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించారు అని తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ లోనూ నిర్మాణ విలువలు చాలా బాగా కనిపించాయి. సినిమాని నిర్మాతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీశారని చెప్పవచ్చు.

బలాలు:

నిర్మాణ విలువలు

యాక్షన్ సన్నివేశాలు

ప్రీ ఇంటర్వెల్

బలహీనతలు:

స్క్రీన్ ప్లే

డైరెక్షన్

అనవసరమైన ట్విస్టులు

స్లో నరేషన్

చివరి మాట:

సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. ఫస్టాఫ్ లోని ఫ్యామిలీ డ్రామా, కామెడీ సన్నివేశాలు బాగానే అనిపించాయి. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాలు కూడా చాలా బాగా వచ్చాయి. కానీ సెకండ్ హాఫ్ ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో చాలా స్లో అయిపోయింది. కథలో సడన్గా బోలెడు సబ్ స్టోరీలు, అనవసరమైన ట్విస్ట్లు రావడంతో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పోతుంది. సెకండ్ హాఫ్ లో ఉన్న చాలావరకు అనవసరమైన సన్నివేశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా మారాయి. ఒక్కొక్కసారి సినిమాలో అసలు ఏమి జరుగుతుందని ప్రేక్షకులకు అర్థం కూడా కాదు. ఓవరాల్గా సినిమా కొన్ని చోట్ల బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ లో మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది.

బాటమ్ లైన్:

ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన "ఖిలాడి".

Highlights

Khiladi Review: చిత్రం: ఖిలాడి

Khiladi Review: చిత్రం: ఖిలాడి

నటీనటులు: రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి, అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు

నిర్మాతలు: సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ

దర్శకత్వం: రమేష్ వర్మ

బ్యానర్: పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్

విడుదల తేది: 11/02/2021

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇప్పుడు అదే జోరుతో వరుసగా సినిమాలు లైన్ లో పెట్టిన రవితేజ తాజాగా ఇప్పుడు "ఖిలాడి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాక్షసుడు సినిమా తో మంచి హిట్ అందుకున్న రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరీలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ కు ఊహించిన స్థాయిలో ఆదరణ లభించలేదు కానీ మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఇవ్వాళ అనగా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా..

కథ: ఒక రాజకీయ నాయకుడు ప్రస్తుతం ఉన్న హోంమినిస్టర్ ని ముఖ్యమంత్రి గా చేయడం కోసం ఇటలీ నుంచి 2 వేల కోట్ల రూపాయలను తీసుకుంటాడు. కానీ ఒక సామాన్యుడు గాంధీ (రవితేజ) ఆ రాజకీయ నాయకుడి కి అడ్డుగా మారతాడు. అసలు గాంధీ ఎవరు? అసలు సిబిఐ గాంధీ వెనక ఎందుకు పడుతుంది? తన కుటుంబాన్ని గాంధీ కాపాడుకోగలిగాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు: సినిమా మొత్తం మీద రవితేజ నటన పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. తన స్టైల్ తో ప్రేక్షకులను రవితేజ చాలా బాగా ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలతో పోలిస్తే రవితేజ ఈ సినిమాలో ఒక సరికొత్త పాత్రలో కనిపించారు. తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. డింపుల్ హాయాతి, మీనాక్షి చౌదరి ఇద్దరికీ సినిమాల్లో మంచి పాత్రలు లభించాయి. ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర లు దక్కాయి. తమ పాత్రలకి వారిద్దరూ పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. సీనియర్ హీరో అర్జున్ సర్జా నటన ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. సిబిఐ ఆఫీసర్ పాత్రలో అర్జున్ చాలా బాగా నటించారు. ఉన్ని ముకుందన్ రావు రమేష్ సచిన్ ఖేడేకర్ ముఖేష్ రుషి కూడా తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగానే వర్కౌట్ అయింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం: "వీర" సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి రమేష్ వర్మ మరియు రవితేజ కాంబినేషన్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన అప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించ లేదనే చెప్పుకోవాలి. రమేష్ వర్మ టేకింగ్ ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోతే లేకపోవడం అభిమానులు సైతం నిరాశకు గురి చేసింది. రమేష్ వర్మ నెరేషన్ చాలా స్లోగా ఉండడంతో ప్రేక్షకులకి ఈ సినిమా పై ఆసక్తి మొదట్లోనే తగ్గిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. ఒకటి రెండు పాటలు బాగానే అనిపించాయి. నేపధ్య సంగీతం కూడా సినిమాకి బాగానే సెట్ అయింది. జీకే విష్ణు మరియు సుజిత్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. నిర్మాతలు సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించారు అని తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ లోనూ నిర్మాణ విలువలు చాలా బాగా కనిపించాయి. సినిమాని నిర్మాతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీశారని చెప్పవచ్చు.

బలాలు: నిర్మాణ విలువలు యాక్షన్ సన్నివేశాలు ప్రీ ఇంటర్వెల్

బలహీనతలు: స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనవసరమైన ట్విస్టులు స్లో నరేషన్

చివరి మాట: సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. ఫస్టాఫ్ లోని ఫ్యామిలీ డ్రామా, కామెడీ సన్నివేశాలు బాగానే అనిపించాయి. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాలు కూడా చాలా బాగా వచ్చాయి. కానీ సెకండ్ హాఫ్ ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో చాలా స్లో అయిపోయింది. కథలో సడన్గా బోలెడు సబ్ స్టోరీలు, అనవసరమైన ట్విస్ట్లు రావడంతో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పోతుంది. సెకండ్ హాఫ్ లో ఉన్న చాలావరకు అనవసరమైన సన్నివేశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా మారాయి. ఒక్కొక్కసారి సినిమాలో అసలు ఏమి జరుగుతుందని ప్రేక్షకులకు అర్థం కూడా కాదు. ఓవరాల్గా సినిమా కొన్ని చోట్ల బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ లో మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది.

బాటమ్ లైన్: ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన "ఖిలాడి".

Show Full Article
Print Article
Next Story
More Stories