క్రేజీ మల్టీస్టారర్: రవితేజ–నవీన్ పోలిశెట్టి కాంబోతో క్రేజీ ఎంటర్‌టైనర్‌ హంగామా రెడీ!

క్రేజీ మల్టీస్టారర్: రవితేజ–నవీన్ పోలిశెట్టి కాంబోతో క్రేజీ ఎంటర్‌టైనర్‌ హంగామా రెడీ!
x

క్రేజీ మల్టీస్టారర్: రవితేజ–నవీన్ పోలిశెట్టి కాంబోతో క్రేజీ ఎంటర్‌టైనర్‌ హంగామా రెడీ!

Highlights

మాస్ మహారాజా రవితేజ మరియు యూత్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి జంటగా ఓ క్రేజీ ఎంటర్‌టైనర్‌కు పునాది పడబోతోందని సమాచారం.

ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు పెరుగుతాయని అనుకున్నా, పెద్దగా ఊపందుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల స్థాయి హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించగల శక్తి రాజమౌళి లాంటి దిగ్గజాలకే సాధ్యమని భావించి, ఇతర దర్శకులు ఆ దిశగా ఎక్కువగా అడుగులు వేయలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ కాంబినేషన్ సెట్ అవుతుందన్న వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మాస్ మహారాజా రవితేజ మరియు యూత్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి జంటగా ఓ క్రేజీ ఎంటర్‌టైనర్‌కు పునాది పడబోతోందని సమాచారం. ప్రముఖ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఇటీవల ఈ ఇద్దరికీ కథ వినిపించగా, ఒకే సిట్టింగ్‌లోనే ఇద్దరూ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు.

ప్రసన్నకుమార్ చాలా కాలంగా దర్శకత్వం వైపు అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. నా సామీ రంగా సమయంలో డైరెక్షన్ చేయాలనుకున్నా, చివరికి స్క్రిప్ట్ వరకే పరిమితమయ్యాడు. ఈసారి రవితేజ, నవీన్ పోలిశెట్టి ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇదే ఆయనకు డైరెక్షన్ డెబ్యూ అయ్యే అవకాశముంది. లేదంటే వేరొక దర్శకుడికి బాధ్యత అప్పగించే అవకాశముంది.

ఇది ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్‌లోనే ఉంది. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాతే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మరియు ఇడియట్ చంటి కలిస్తే తెరపై జరగబోయే కామెడీ అల్లరి ఊహించడమే రసవత్తరంగా ఉంది.

రచయితగా మజాకాతో నిరాశ ఎదుర్కొన్న ప్రసన్నకుమార్ ఈసారి పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ రాసినట్లు తెలుస్తోంది. కథ విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉండే నవీన్ పోలిశెట్టి అంత వేగంగా అంగీకరించడం కూడా ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న క్రేజ్‌కి నిదర్శనం. ఇక ఈ కాంబో ఎప్పుడు ఫైనల్ అవుతుందో, ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories