రవీనా టాండన్ పై కాయిన్ల వర్షం కురిపించిన అభిమానులు

Raveena Tandon Shared an Interesting Video Related to KGF Movie
x

రవీనా టాండన్ పై కాయిన్ల వర్షం కురిపించిన అభిమానులు

Highlights

*కే జి ఎఫ్ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వీడియో ని షేర్ చేసిన రవీనా టాండన్

Raveena Tandon: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరో గా నటించిన కే జి ఎఫ్ చాప్టర్ టు సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ ఫ్రాంచైజీ లో రెండవ భాగం గా ఈ సినిమా ఇప్పుడు రికార్డు స్థాయిలో కాసుల వర్షం కురిపిస్తోంది. శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

రాఖీ భాయ్ పాత్రలో యశ్ నటనా మాస్ ప్రేక్షకులలో ఒక ప్రభంజనం సృష్టించింది. హిందీలో మొదటి రోజున ఈ సినిమా 50 కోట్లకు మించి వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను షాక్కి గురి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్లకు మించి వసూళ్లను రాబట్టి అతి త్వరలోనే 100 కోట్ల మార్కును చేరడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో రవీనా టాండన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు.

సినిమా ఆక్టర్ లో రవీనాటాండన్ కే జి ఎఫ్ చాప్టర్ త్రీ కి సంబంధించిన పేపర్లను చూస్తూ ఉంటుంది. ఆ సన్నివేశంలో అంతో కాయిన్స్ ని వెదజల్లడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో ని రవీనాటాండన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి దృశ్యం పునరావృతం అయిందని సంతోషాన్ని వ్యక్తపరిచారు రవీనాటాండన్

Show Full Article
Print Article
Next Story
More Stories