Rashmika: కథ బాగుంటే నలుగురు పిల్లల తల్లిగానే కాదు.. బామ్మ పాత్ర అయినా ఓకే.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rashmika Mandanna Intersting comments
x

కథ బాగుంటే నలుగురు పిల్లల తల్లిగానే కాదు.. బామ్మ పాత్ర అయినా ఓకే.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Highlights

రష్మిక మందన్న.. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల తను నటించిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అవుతోంది.

Rashmika: రష్మిక మందన్న.. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల తను నటించిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అవుతోంది. దీంతో హిట్ మీద హిట్ కొట్టుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు రష్మిక. ప్రస్తుతం ఛావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 14 థియేటర్‌లోకి వచ్చిన ఛావా సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో ఏసుబాయిగా నటించి చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకి హాజరైన రష్మిక పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాను ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోనని.. అలా ఆలోచిస్తూ పోతే ప్రతి చిన్న విషయం కూడా కష్టంగానే అనిపిస్తుందని తెలిపారు. నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ పోతానని చెప్పారు. ఎవరైన మూవీ కోసం తనను కలిసినప్పుడు స్టోరీకే ప్రియారిటీ ఇస్తానని తెలిపారు. స్టోరీ నచ్చితే నలుగురి పిల్లల తల్లిగానే కాదు.. బామ్మ పాత్ర చేయడానికైనా సిద్ధమని చెప్పుకొచ్చారు. తాను నటిస్తోన్న మూవీల సక్సెస్ వెనక ఎలాంటి ప్రణాళికలు లేవని.. విజయం అనేది మన చేతిలో ఉండదన్నారు. ఏదో శక్తి తనని నడిపిస్తుందని.. అదృష్టవశాత్తు సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. అలాంటి సినిమాల్లో భాగం కావడం తన అదృష్టమన్నారు. ప్రజలు తన సినిమాలు ఆదరిస్తున్నందుకు, తనపై చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఛావా మూవీలో అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు. ఇందులో ఏసుబాయి పాత్రలో నటించినందుకు గర్వంగా ఉందని.. ఎప్పుడు ఈ పాత్రలో నటిస్తానని అనుకోలేదన్నారు. ప్రతి హీరో ఇలాంటి స్టోరీలో భాగం కావాలని అనుకుంటారని అన్నారు. సాధారణంగా ఛత్రపతి శివాజీ, తన కుమారుడు శంభాజీ గురించి పుస్తకాల్లో చదివినప్పుడు అంతగా డెప్త్‌గా ఊహించుకోలేమని.. కానీ తమ జీవితాలను తెరపై చూస్తున్నప్పుడు నిజంగా కళ్లకు కట్టినట్టే అనిపిస్తాయని అన్నారు.

ప్రస్తుతం రష్మిక.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్, సల్మాన్ ఖాన్-మురుగదాస్ కాంబోలో రూపొందుతున్న సికిందర్, ధనుష్-శేఖర్ కమ్ముల మూవీ కుబేర వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories