సమంత లాగానే రష్మిక మందన్న కూడా నో చెప్పిన సినిమా

Rashmika Mandanna Dropped Director Rahul Ravindran Film | Telugu Movie News
x

సమంత లాగానే రష్మిక మందన్న కూడా నో చెప్పిన సినిమా

Highlights

*సమంత లాగానే రష్మిక మందన్న కూడా నో చెప్పిన సినిమా

Rashmika Mandanna: నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ "చి ల సౌ" సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ తన రెండవ సినిమా "మన్మధుడు 2" తో మాత్రం అంతగా మెప్పించలేకపోయారు. ఇక తాజాగా రాహుల్ రవీంద్రన్ ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అని తెలిసిందే.

ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా సమంత అని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కానీ కొన్ని ఈక్వేషన్స్ కుదరకపోవడం వల్ల రష్మిక మందన్న కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో ఈ చిత్రాన్ని నిర్మించాల్సిన గీత ఆర్ట్స్ బ్యానర్ వారు ఈ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి గీతా ఆర్ట్స్ వారు నిజంగానే ఈ సినిమాని పక్కన పెట్టేశారా? అయితే రాహుల్ రవీంద్రన్ మరొక బ్యానర్ లో ఈ సినిమాని తీస్తారా లేదా? అని ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories