రష్మికకు డిసెంబర్ సెంటిమెంట్.. పుష్ప2 హిట్ అంటున్న ఫ్యాన్స్..

Rashmika Mandanna December Sentiment
x

రష్మికకు డిసెంబర్ సెంటిమెంట్.. పుష్ప2 హిట్ అంటున్న ఫ్యాన్స్..

Highlights

ఈ నెలలో విడుదలైన రష్మిక చాలా సినిమాలు విజయవంతం కావడంతో తాజాగా ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న పుష్ఫ2కు ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొత్తగా సినీ ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా వారికి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే రష్మికకు డిసెంబర్ నెల బాగా కలిసొస్తుందంట. ఈ నెలలో విడుదలైన రష్మిక చాలా సినిమాలు విజయవంతం కావడంతో తాజాగా ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న పుష్ఫ2కు ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. పుష్ప మూవీ విశేషాలు, షూటింగ్ అనుభవాలు పంచుకున్నారు. అలాగే డిసెంబర్ అంటే తనకు చాలా సెంటిమెంట్ అని, తన లక్కీ మంత్ అని చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. రష్మిక హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా కిరాక్ పార్టీ డిసెంబర్ నెలలోనే విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో నటించిన అంజనీపుత్ర, చమక్ సినిమాలు డిసెంబర్ లోనే విడుదలై విజయం సాధించాయి. పుష్ప సినిమా 2021 డిసెంబర్ లో విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రష్మికకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

అంతేకాదు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ డిసెంబర్ లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. తాజాగా ఈ నెల 5న విడుదల కాబోతున్న పుష్ప2 ది రూల్ మూవీ కూడా ఇదే డిసెంబర్ నెలలో విడుదలవుతుంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సెంటిమెంట్ ప్రకారం పుష్ప2 మూవీ కూడా హిట్ అవుతుందని.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందని రష్మికతో పాటు ఆమె అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.617 కోట్ల షేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే రూ.620 కోట్లు షేర్ వసూళ్లను రాబట్టాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories