విజయ్ దేవరకొండతో వివాదం.. గిరిజన మహిళలతో రష్మిక డాన్స్‌.. ఏదో తేడాగా ఉందే?

విజయ్ దేవరకొండతో వివాదం.. గిరిజన మహిళలతో రష్మిక డాన్స్‌.. ఏదో తేడాగా ఉందే?
x
Highlights

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల కుబేరతో హిట్ అందుకున్న రష్మిక, త్వరలో ది గర్ల్ ఫ్రెండ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల కుబేరతో హిట్ అందుకున్న రష్మిక, త్వరలో ది గర్ల్ ఫ్రెండ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ఆమె కొత్త సినిమా మైసా (Mysaa) పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది.

సాంప్రదాయ చీరలో రష్మిక సందడి

అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన పూజా కార్యక్రమంలో రష్మిక సాంప్రదాయ చీర కట్టుకుని పాల్గొని సందడి చేశారు. గిరిజన మహిళలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. రష్మిక వారితో కలిసి గోండు పాటకు డాన్స్ చేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియోపై విభిన్నంగా స్పందిస్తున్నారు.

విజయ్ దేవరకొండపై ఆగ్రహం, రష్మికపై ప్రశంసలు

ఇదే సమయంలో, విజయ్ దేవరకొండపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెట్రో మూవీ వేడుకల్లో "500 ఏళ్ల క్రితం గిరిజనులు కొట్టుకునేవారు" అన్న వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు కేసులు పెట్టాయి. ఆయన సినిమాలను అడ్డుకుంటామంటూ పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరుగుతున్నాయి.

అయితే అదే సమయంలో రష్మిక గిరిజన మహిళలతో కలిసి డాన్స్ చేయడం చర్చనీయాంశమైంది. విజయ్ వివాదంలో ఇరుక్కుంటే, రష్మిక సానుకూల స్పందన తెచ్చుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.



Show Full Article
Print Article
Next Story
More Stories