Rashmika : ఆ హీరోతో మరోసారి రొమాన్స్ చేయడానికి రెడీ అయిన రష్మిక

Rashmika : ఆ హీరోతో మరోసారి రొమాన్స్ చేయడానికి రెడీ అయిన రష్మిక
x

Rashmika : ఆ హీరోతో మరోసారి రొమాన్స్ చేయడానికి రెడీ అయిన రష్మిక

Highlights

ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, అతి తక్కువ కాలంలోనే 'నేషనల్ క్రష్'గా ఎదిగిన రష్మిక మందన్న ప్రస్తుతం కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది.

'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, అతి తక్కువ కాలంలోనే 'నేషనల్ క్రష్'గా ఎదిగిన రష్మిక మందన్న ప్రస్తుతం కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. 'పుష్ప'తో గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.

రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌తో కలిసి ‘కాక్‌టెయిల్-2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ హిట్ జోడీ మరో క్రేజీ ప్రాజెక్టులో భాగం కాబోతోంది. ‘బధాయి హో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ కామెడీ సినిమా సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు, అల్లు అర్జున్-అట్లీ కాంబోలో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘AA22’లో రష్మిక ఒక పవర్ ఫుల్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో (విలన్‌గా) కనిపించబోతుందనే వార్త ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది.

ఇక గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉన్న విజయ్ దేవరకొండ - రష్మికల ప్రేమాయణం శుభం కార్డు వైపు అడుగులు వేస్తోంది. వీరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు ఇప్పటికే వైరల్ కాగా, ఇప్పుడు వీరి వివాహ వేడుకకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట ఒక్కటి కాబోతున్నారనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు పెళ్లి వార్తలతో రష్మిక మందన్న ఇప్పుడు ట్రేడింగ్‌లో నిలుస్తోంది. వృత్తిగతంగా విలన్ పాత్రలతో ప్రయోగాలు చేస్తూ, వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న ఈ శ్రీవల్లికి అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories