Rashmika: డబ్బులిచ్చి నాపై ట్రోల్స్ చేయించారు.. రష్మిక సంచలన ఆరోపణలు

Rashmika Mandanna Alleges Paid Trolling against Her
x

Rashmika: డబ్బులిచ్చి నాపై ట్రోల్స్ చేయించారు.. రష్మిక సంచలన ఆరోపణలు

Highlights

Rashmika: ట్రోల్స్‌కు, హీరోయిన్ రష్మికా మందన్నకు మధ్య విడదీయరాని బంధం ఉంది. ఆమె ఏ పని చేసినా, ఎలా మాట్లాడినా, ఎలా నడుచుకున్నా ఏదో ఒక దానిపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.

Rashmika: ట్రోల్స్‌కు, హీరోయిన్ రష్మికా మందన్నకు మధ్య విడదీయరాని బంధం ఉంది. ఆమె ఏ పని చేసినా, ఎలా మాట్లాడినా, ఎలా నడుచుకున్నా ఏదో ఒక దానిపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ ట్రోల్స్‌ను రష్మిక ఎక్కువగా పట్టించుకోనప్పటికీ, ఇప్పుడు ఆమె ఒక సంచలన ఆరోపణ చేశారు. తనపై ట్రోల్స్ చేయడానికి డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రష్మిక మందన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మనసులోని బాధను బయటపెట్టారు. తనపై జరుగుతున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. "నాపై డబ్బులు ఇచ్చి ట్రోల్స్ చేయించారు. నా గురించి నెగటివ్ విషయాలు ప్రచారం చేశారు. నేను ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాను" అని అన్నారు. ఇలాంటి చర్యలు తనను చాలా బాధించాయని ఆమె చెప్పారు.

నేను ఒక భావోద్వేగ జీవిని. నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటున్నాను. కానీ నా భావోద్వేగాలను బయటపెట్టడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో ప్రేమగా ఉండడాన్ని కూడా బలహీనతగా చూస్తున్నారు. కెమెరా కోసం రష్మిక ఇలా నటిస్తుంది అని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మీరు ప్రేమ, దయ చూపలేకపోతే సైలెంటుగా ఉండండి. ఈ ప్రపంచంలో అందరూ ఎదగడానికి చాలా స్థలం ఉంది. ఒకరు ఎదుగుతుంటే ఎందుకు ఆపాలని చూస్తున్నారు? ప్రజలు ఎందుకు ఇలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయమని తన ఆవేదనను వెళ్లగక్కారు.

రష్మిక తన కెరీర్‌లో ఇలాంటి అడ్డంకులను చాలా ఎదుర్కొన్నారు. అయితే, ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఎదిగారు. ఆమె ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన కుబేర సినిమా మంచి విజయం సాధించింది. లేటెస్టుగా గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

విజయ్ దేవరకొండ సినిమా 'కింగ్డమ్' విజయం సాధించినప్పుడు రష్మిక ఆయనను అభినందించారు. దీనిపై కూడా ట్రోల్స్ వచ్చినప్పుడు ఆమె తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి ప్రేమ తనకెంతో బలాన్ని ఇస్తుందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories