రణ్ బీర్ కపూర్ తో రొమాన్స్ చేయబోతున్న రష్మిక మందన్న

Rashmika Mandanna Acting With Ranbir Kapoor | Telugu Movie News
x

రణ్ బీర్ కపూర్ తో రొమాన్స్ చేయబోతున్న రష్మిక మందన్న

Highlights

*రణ్ బీర్ కపూర్ తో రొమాన్స్ చేయబోతున్న రష్మిక మందన్న

Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ మధ్యనే పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న "మిషన్ మజ్ను" సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. ఇక గుడ్ బయ్ సినిమా తో అమితాబచన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న రష్మిక తాజాగా ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన రష్మిక హీరోయిన్ గా కనిపించబోతొందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"అర్జున్ రెడ్డి" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ వంగ అదే సినిమాని "కబీర్ సింగ్" అనే టైటిల్తో తీసి మరొక హిట్ అందుకున్నారు. ఇప్పుడు సందీప్ రణ్ బీర్ కపూర్ హీరోగా "యానిమల్" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్న సంప్రదించగా ఆమె వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇలా రష్మిక చేతుల్లోకి మరొక బాలీవుడ్ సినిమా వచ్చి పడింది. మరోవైపు తెలుగులో కూడా రష్మిక "పుష్ప: ది రూల్" సినిమాతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories