ఐదేళ్ళ వయసులోనే రాష్మిక అదరగొట్టేసిందిగా!

K V D Varma
Updated on: 5 Jun 2020 7:58 PM IST
ఐదేళ్ళ వయసులోనే రాష్మిక అదరగొట్టేసిందిగా!
X
rashmika mandana childhood photo (source:rashmika instagram)

రష్మిక మందాన ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. క్యూట్ లుక్స్ తో.. గ్లామరస్ హీరోయిన్ గా వరుస హిట్ లతో ఈ బ్యూటీ తెలుగు ప్రజల మనసులు దోచేసుకుంది. ఇప్పుడు తెలుగు తెరపై హీరోల మొదటి ఆప్షన్ రాష్మిక అంటే అతిశయోక్తి కాబోదు. ఇప్పుడు ఆమెకు ఉన్న క్రేజ్ కి మీడియాలో ఆమె ఫోటోలు ఎన్నో. ప్రతిరోజూ సోషల్ మీడియా..ప్రింట్ మీడియా.. ఎలక్ట్రానిక్ మీడియా ఇలా అన్ని వేదికల మీదా ఆమె ఫోటో ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. వేలాది లైక్ లూ వస్తూ ఉంటాయి.

అయితే, మీడియాలో ఫోటోలూ.. లైకులూ రాష్మికకు చిన్నతనం నుంచే అలవాటు. తన ఐదేళ్ళ ప్రాయంలోనే ఒక మ్యాగజైన్ కవర్ పేజీ మీద ఆమె తళుక్కుమంది. మ్యాగజైన్ పై ముఖచిత్రంగా కనిపించడం అంటే అప్పట్లో అంత ఈజీ కాదు. ఇప్పుడూ కాదు కానీ, రకరకాల మీడియాలు వచ్చాకా వాటికి క్రేజ్ కొంత తగ్గింది. అప్పట్లో మ్యాగజిన్ కవర్ పేజీ మీద కనిపిస్తే సెలబ్రిటీలు మురిసిపోయేవారు.

తన ఐదేళ్ళ వయసులో ఓ మ్యాగజైన్ కవర్ పేజీ పైన తానున్న ఫోటోను ఇప్పుడు రాష్మిక తన ఇంస్టాగ్రామ్ ఎకౌంట్లో పోస్ట్ చేసింది రాష్మిక. అప్పుడు ఆ కవర్ పేజీ మీద తాను ఏరకంగా ఉందొ ఆరకంగా ఇప్పుడూ ఫోజిచ్చి ఓ ఫోటో తీసుకుని దానికి జత చేసింది.

2001 లో గోకులం అనే పత్రిక కోసం రష్మిక ఫోటోషూట్ లో పాల్గొంది. అప్పుడు అందులో బావున్న ఈ ఫోటో ను ఆ పత్రిక కవర్ పేజీగా ముద్రించింది. ఈ కవర్ పేజీని రష్మిక తల్లి జాగ్రత్తగా భద్రపరిచారు. ఇదే కాదు రాష్మిక చిన్నతనం నుంచి వచ్చిన ఫోటోలు అన్నీ ఆమె తీసి జాగ్రత్త చేసి ఉంచారట. అందులోంచి ఇప్పుడు ఈ ఫోటో రష్మిక అభిమానుల తో పంచుకుంది.

ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో ఆమె అభిమానులను విపరీతంగా అలరిస్తోంది.



K V D Varma

K V D Varma

Next Story