Kuber movie: నా నటనపై ప్రశంసలన్నీ శేఖర్ కమ్ముల గారివల్లే… భావోద్వేగంతో పోస్ట్ చేసిన రష్మిక

Kuber movie: నా నటనపై ప్రశంసలన్నీ శేఖర్ కమ్ముల గారివల్లే… భావోద్వేగంతో పోస్ట్ చేసిన రష్మిక
x

Kuber movie: నా నటనపై ప్రశంసలన్నీ శేఖర్ కమ్ముల గారివల్లే… భావోద్వేగంతో పోస్ట్ చేసిన రష్మిక

Highlights

తాజాగా విడుదలైన "కుబేర" చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా థియేటర్ల ముందు కనపడని హౌస్‌ఫుల్ బోర్డులు మళ్లీ మెరుస్తున్నాయి

Kuber movie: తాజాగా విడుదలైన "కుబేర" చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా థియేటర్ల ముందు కనపడని హౌస్‌ఫుల్ బోర్డులు మళ్లీ మెరుస్తున్నాయి. అంచనాలను మించి వచ్చిన పాజిటివ్ టాక్‌తో, ఈ సినిమా ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. ముఖ్యంగా ధనుష్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసల వెల్లువ తెచ్చుకుంటుండగా, నాగార్జున పోషించిన పాత్ర మాత్రం ప్రత్యేకంగా చర్చకు వస్తోంది.

అయితే ఈ చిత్రంలో సమీరా అనే పాత్రను పోషించిన రష్మిక మందన్నా కూడా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను మరొకసారి గెలుచుకుంది. సమీరా పాత్రలో ఆమె చేసిన జీవనదృష్టితో నటనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది.

ఈ నేపథ్యంలో రష్మిక తన ఆనందాన్ని, కృతజ్ఞతను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసింది. ‘‘శేఖర్ కమ్ముల సార్ దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఎప్పట్నుంచో ఉంది. ఆ కోరిక 'కుబేర' ద్వారా నెరవేరింది. సమీరా పాత్రలో నేను ఒదిగిపోయేలా అవకాశం ఇవ్వడమేగాక, ప్రతి సన్నివేశంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆ కారణంగానే ఈ పాత్రకు నేను జీవం పోయగలిగాను’’ అని భావోద్వేగంతో చెప్పింది.

అలాగే ధనుష్ లాంటి ప్రతిభావంతుడైన నటుడితో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఆమె ఎంతో విలువైనదిగా పేర్కొంది. ప్రతి సీన్‌కి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతవో ఆయనతో కలిసి పని చేసినపుడే బాగా తెలిసిందని తెలిపింది. నాగార్జున గురించి మాట్లాడుతూ, ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, ఆయన నుంచి తనకు చాలా నేర్చుకునే అవకాశం లభించిందని వెల్లడించింది.

‘‘‘కుబేర’ సినిమా అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమని నేను అనుకుంటున్నాను. సమీరా పాత్ర, కథ మొత్తం ఒక అందమైన గందరగోళంలా ఉంది. మీరు సినిమా చూసిన తర్వాత నా మాట అర్థమవుతుంది’’ అంటూ తన టీమ్‌కి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసింది రష్మిక. ప్రస్తుతం ఆమె ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories