మనదేశం వాళ్లను పరీక్షించరా?

మనదేశం వాళ్లను పరీక్షించరా?
x
Rashmi Goutham FilePhoto
Highlights

రష్మీ గౌతమ్ అంటే తెలియని వారు ఉండరు. టీవీ కార్యక్రమాల్లో ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది రష్మీ.

రష్మీ గౌతమ్ అంటే తెలియని వారు ఉండరు. టీవీ కార్యక్రమాల్లో ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది రష్మీ.రష్మీ శైలిలో యాంకరింగ్ చేస్తూ పాపులర్ అయ్యింది. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూనే.. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ బీజీగా ఉంది.

రష్మీకి ఉండే సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు. అందులో భాగంగా మహిళలపై అత్యాచారాల విషయంలోగానీ, మూగ జీవాల సంరక్షణలోగాని ట్వీట్టర్ వేదికగా ఎప్పటికప్పుడు స్పందిస్తూ తన అభిప్రాయాన్ని చెబుతూంటారు.

కాగా ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తోన్న మహామ్మారి కరోనా వైరస్. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ పతనం అయింది. సినిమా, క్రీడా రంగాలతో సహా అన్ని రంగాలను దెబ్బ తీసింది. అంతే కాదు ఇప్పటికే ఈ మహామ్మారి దాడికి 5వేలకు పైగాచనిపోయారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీని ప్రభావంతో దేశంలో ఇద్దరు మరణించారు. మరొ 84మందిలో పాజిటివ్ అని తేలింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించింది. దేశంలో ఈ వైరస్ కట్టడి కోసం పలు రాష్ట్రాలు మార్చి 31వరకు స్కూల్స్ , మాల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల్లో కూడా తగిన చర్యలు తీసుకున్నారు.

అంతేకాదు అందులో భాగంగా ఎయిర్ పోర్ట్స్‌లో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను థర్మల్ స్కానింగ్ చేస్తున్నారు. కాగా, రష్మీ ఈ విషయంపై స్పందిస్తూ ఈ కరోనా వైరస్ స్కానింగ్ కేవలం అంతర్జాతీయ ప్రయాణికులకేనా అంటూ ట్వీట్ చేసింది. దేశంలో పర్యటించే ప్రయాణికులకు అవసరం లేదా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. రష్మీ పోస్ట్‌పై నెటిజన్స్ స్పందిస్తూన్నారు. రష్మీ మంచి ప్రశ్న వేశారు అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories