Rashmi Gautam: ఆస్పత్రి బెడ్ పై జబర్దస్త్ యాంకర్.. ఆ నొప్పి భరించలేకపోయా అంటూ ఎమోషనల్ పోస్ట్

Rashmi Gautam
x

Rashmi Gautam: ఆస్పత్రి బెడ్ పై జబర్దస్త్ యాంకర్.. ఆ నొప్పి భరించలేకపోయా అంటూ ఎమోషనల్ పోస్ట్

Highlights

Rashmi Gautam Viral Post: జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ సడన్‌గా ఆసుపత్రిలో చేరిన ఫోటో వైరల్ అవుతుంది.

Rashmi Gautam Viral Post: జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ పాపులర్ షోలతో ఫేమస్ అయింది. ఇది ఇలా ఉండగా పలు సినిమాల్లో కూడా ఆమె నటించిన సంగతి తెలిసిందే. అందులో కూడా మంచి పాపులారిటీ సంపాదించిన రష్మి గౌతమ్ సడన్‌గా ఏమైందో తెలీదు కానీ ఆసుపత్రి బెడ్ పై కనిపించింది. సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసి ఆమె ఆశ్చర్యపరిచింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మి గౌతమ్ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూనే ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె చేసిన ఓ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతుంది.

'కొన్ని రోజులుగా హెల్త్ బాగా లేకపోవడంతో అనుమానం వచ్చింది. కమిట్‌మెంట్లు త్వరగా పూర్తి చేసుకున్న, భుజాల నొప్పి ఎక్కువ, తీవ్ర రక్తస్రావం కూడా అవుతుంది. హిమోగ్లోబిన్ స్థాయి పడిపోయింది.9 కి చేరడంతో ఏం చేయాలో అర్థం కాక ఆసుపత్రిలో చేరాలో కూడా తెలియని పరిస్థితి. ఎలాగో అలా మార్చి 29 వరకు మ్యానేజ్ చేశా. ఏప్రిల్ 18వ తేదీన ఆపరేషన్ అయింది' అంటూ ఓ ఫొటో షేర్ చేసింది. అయితే ఆపరేషన్ తర్వాత తాను ఈ ఫోటో షేర్ చేస్తున్నట్లు రాసుకోవచ్చింది. అయితే ఈ పోస్టులో మాత్రం అసలు రష్మికి ఏమైందో మాత్రం షేర్ చేయలేదు.

అయితే ఆమెకు మాత్రం సర్జరీ అయినట్లు తెలుస్తోంది. ఈ ఐదు రోజుల పాటు తనతో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ, హాస్పిటల్ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు అని రాసుకొచ్చింది. మళ్ళీ హెల్త్‌ సెట్ అయ్యాక కమ్‌ బ్యాక్ ఇస్తాను అంటూ రష్మి గౌతమ్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతోంది.ఈ పోస్ట్‌ చూసిన వారు రష్మీ త్వరగ కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories