Top
logo

Rashi Khanna: సైకో కిల్లర్ గా రాశిఖన్నా

Rashi Khanna New Web Series Update
X

Rashi Khanna:(File Image)

Highlights

Rashi Khanna: అజయ్ దేవగణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న వెబ్ సిరీస్ లో, రాశి ఖన్నా సైకో కిల్లర్ పాత్రలో కనిపించనుందట.

Rashi Khanna: టాలీవుడ్ లో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా తన అందంతో కుర్రకారుని కట్టిపడేసింది. సక్సెస్, ఫెయిల్యూర్స్ ను బేరీజు వేసుకుంటే రాశీఖన్నా ఖాతాలో పడిన పరాజయాలే అధికం. అయినప్పటికీ దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించిందీ భామ. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ఈ అమ్మడు ముందు వరసలోనే వుంది.

రాశీ ఖన్నా ఇతర భాషల్లోనూ నాలుగైదు సినిమాలు చేస్తోంది. అంతేకాదు… బ్యాక్ అటు బ్యాక్ రెండు వెబ్ సీరిస్ లకు పచ్చజెండా ఊపేసిన విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ -2' తో సమంతను వెబ్ సీరిస్ కు పరిచయం చేసిన ఇద్దరు మిత్రులు రాజ్ అండ్ డీకే... రాశీఖన్నాను అదే తరహాలో డిజిటల్ మీడియాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ రెండు వెబ్ సీరిస్ లలో ఒకదానిలో షాహిద్ కపూర్ నటిస్తుంటే, మరో దానిలో అజయ్ దేవ్ గన్ నటిస్తున్నాడు.

అజయ్ నటిస్తున్న 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' వెబ్ సీరిస్ లో రాశీఖన్నా సైకో కిల్లర్ గా నటించబోతోందని తెలుస్తోంది. అజయ్ దేవ్ గన్ పర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించే ఈ వెబ్ సీరిస్ కు రాజేశ్‌ ముపుస్కర్ దర్శకుడు కాగా అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్, బీబీసీ స్టూడియోస్ దీనిని సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. బ్రిటీష్ వెబ్ సీరిస్లూథర్` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్, డిస్నీ హాట్ స్టార్ లో జులై 21 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది.

Web TitleRashi Khanna New Web Series Update
Next Story