logo

కె జీ ఎఫ్ సినిమాలో కనిపించబోతున్న ప్రముఖ టాలీవుడ్ నటుడు

కె జీ ఎఫ్ సినిమాలో కనిపించబోతున్న ప్రముఖ టాలీవుడ్ నటుడు
Highlights

గ్యాంగ్స్టర్ డ్రామా గా భారీ బడ్జెట్టుతో కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కే జీఎఫ్ చాప్టర్ వన్' సినిమా బ్లాక్...

గ్యాంగ్స్టర్ డ్రామా గా భారీ బడ్జెట్టుతో కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కే జీఎఫ్ చాప్టర్ వన్' సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోను 'కే జి ఎఫ్' సినిమా అంచనాలకు మించి వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. కన్నడ ఫిలిమ్ ఇండస్ట్రీ లోనే అతిపెద్ద బ్లాక్బస్టర్గా నిలిచి పోయింది కే జి ఎఫ్ సినిమా. ఈ సినిమా సక్సెస్ తో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కు దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ లభించింది. ఇక తాజాగా అందరి కన్ను ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ అయిన ఉంది 'కే జి ఎఫ్ చాప్టర్ 2' పైనే ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం పాప్యులర్ టాలీవుడ్ నటుడు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు. అతను ఎవరో కాదు రావు రమేష్. అయితే 'కే జి ఎఫ్' సినిమాలో రావు రమేష్ పాత్ర పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఆగస్టు నుంచి మొదలవుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్ తో పాటు కొందరు బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా ముఖ్య పాత్రను పోషించబోతున్నారు.

లైవ్ టీవి

Share it
Top