రానా "విరాట పర్వం" సినిమా కి విడుదల తేదీ ఖరారు

Ranas Virata Parvam Movie Set to Release on June 17 | Tollywood News
x

రానా "విరాట పర్వం" సినిమా కి విడుదల తేదీ ఖరారు

Highlights

*రానా "విరాట పర్వం" సినిమా కి విడుదల తేదీ ఖరారు

Virata Parvam Movie: రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన పీరియడ్ డ్రామా విరాటపర్వం రెండేళ్లకు పైగా షూటింగ్ దశలోనే ఉంది. ఈ చిత్రం 2021 లోనే విడుదల కావాల్సింది కానీ చాలా కారణాల వల్ల మళ్లీ ఈ సినిమా 2022 కి వాయిదా పడింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు కానీ అదీ జరగలేదు.

ఇక ఈ సినిమాని జులై ఫస్ట్ నా విడుదల చేద్దామని అనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ తాజాగా ఈ సినిమా ని జూన్ 17న తన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.జూన్ 17 న విడుదల కావాల్సిన "రామారావు ఆన్ డ్యూటీ" వాయిదా పడడంతో రానా ఆ తేదీని ఆక్రమించారు అని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలయ్యే వారం ముందు అంటే జూన్ 10వ తేదీన నాని హీరోగా నటించిన "అంటే సుందరానికి" మరియు కన్నడ సినిమా "చార్లీ" విడుదల కాబోతున్నాయి.

కన్నడ సినిమా వల్ల విరాటపర్వం సినిమా కీ పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ నాని సినిమా మంచి హిట్ టాక్ అందుకుంటే అది విరాటపర్వం కలెక్షన్ల పై కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఏదేమైనా జూన్లోనే సినిమా విడుదల చేయడానికి స్లాట్ దొరకడంతో సురేష్ బాబు అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో రానా ఎంతవరకు హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories