చిన్న బడ్జెట్ సినిమా కి జాతీయ అవార్డ్ దక్కేనా?

చిన్న బడ్జెట్ సినిమా కి జాతీయ అవార్డ్ దక్కేనా?
x
Highlights

ఎన్నికలు పూర్తయ్యాక జాతీయ సినిమా అవార్డుల్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి ప్రాంతీయ కేటగిరీలో 'రంగస్థలం', 'మహానటి', 'గీత గోవిందం'...

ఎన్నికలు పూర్తయ్యాక జాతీయ సినిమా అవార్డుల్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి ప్రాంతీయ కేటగిరీలో 'రంగస్థలం', 'మహానటి', 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు 'కేరాఫ్ కంచరపాలెం', 'చిలసౌ' లాంటి పరిమిత బడ్జెట్ చిత్రాలు కూడా పోటీ పడనున్నాయి. వీటిలో ఏ సినిమా జాతీయ అవార్డు అందుకోబోతుంది అనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. చిన్న బడ్జెట్ సినిమా అయినా 'కేరాప్ కంచరపాలెం' చిత్రాన్ని న్యూయార్క్ ఫిలింఫెస్టివల్ లో ప్రదర్శించిన విషయం తెలిసిందే.

మధ్యతరగతి జీవితాల గురించి చాలా చక్కగా తెరకెక్కించాడు కొత్త దర్శకుడు వెంకటేష్ మహా. చిన్న సినిమా అయినా అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నుండి హీరో దగ్గు బాటి రానా చిత్రానికి అండగా నిలవడంతో సినిమాకి హైప్ దక్కింది. ఈ చిత్రానికి సహనిర్మాత గా వ్యవహరించిన రానా ప్రమోషనల్ పనుల్లో కూడా యాక్టీవ్ గా వ్యవహరించారు. నిజానికి ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డుల రేసు నుంచి ఈ సినిమాని తప్పించడంపై అప్పట్లో పెద్ద చర్చ సాగింది కానీ తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కలుగజేసుకుని ఈ సినిమాని జాతీయ అవార్డుల నామినేషన్స్ కి పంపించాల్సిందిగా చెప్పారు. మరి ఈ సినిమా మనకు అవార్డు తెస్తుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories