విరాటపర్వం నుంచి రానా ఫస్ట్ లుక్ వచ్చేసింది

విరాటపర్వం నుంచి రానా ఫస్ట్ లుక్ వచ్చేసింది
x
Rana
Highlights

దగ్గుబాటి వంశం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో రానా .. లీడర్ సినిమాతో నటుడుగా మంచి పేరు తెచ్చుకొని ఆ తరవాత

దగ్గుబాటి వంశం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో రానా .. లీడర్ సినిమాతో నటుడుగా మంచి పేరు తెచ్చుకొని ఆ తరవాత విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించాడు రానా . రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో భల్లలదేవ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు రానా. ఈ సినిమా మంచి హిట్టు కావడం, రానాకి వీపరీతమైన పేరు రావడంతో రానాకి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు రానా..

అందులో భాగంగానే వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమాని చేస్తున్నాడు రానా. ఈ రోజు రానా పుట్టిన రోజు కావడంతో సినిమా నుంచి రానా లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో రానా మొఖానికి ఎర్రటి వస్త్రాన్ని ధరించి కొత్తగా కనిపిస్తున్నాడు. పోస్టర్ కింద రెవల్యూషన్ ఇజ్ ఆన్ ఆక్ట్ అఫ్ లవ్ అని రాసి ఉంది. ఈ సినిమాలో రానాకి జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. ఇందులో సాయి పల్లవి ఓ నక్సలైట్ పాత్రలో కనిపించనుందని సమాచారం. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో సినిమాని విడుదల చేయనున్నారు. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు రానా గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నారు. ఈ సినిమాని కూడా సురేష్ ప్రొడక్షన్స్ వారే నిర్మించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories