కరోనా ప్రభావం : రానా 'అర‌ణ్య' విడుద‌ల వాయిదా

కరోనా ప్రభావం : రానా అర‌ణ్య విడుద‌ల వాయిదా
x
Rana aranya Movie poster
Highlights

ఈ సినిమాని ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదిని వాయిదా వేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

యంగ్ హీరో రానా నటిస్తున్న తాజా చిత్రం 'అర‌ణ్య'.. జంతు ప్రేమికుడిగా రానా ఈ సినిమాలో కనిపిచానున్నాడు.. ఈ సినిమాకి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించగా, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాని నిర్మిస్తోంది. విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రియా పిల్గావోంక‌ర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో సినిమాపైన మంచి అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదిని వాయిదా వేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

" ప్రేక్షకుల అభిరుచులకు ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తోంది. ఇటీవ‌లి కాలంలో వస్తోన్న వార్తల‌ను దృష్టిలో ఉంచుకొని 'అర‌ణ్య'‌, 'హాథీ మేరే సాథీ', 'కాండ‌న్' (త‌మిళ వెర్షన్‌) సినిమాల విడుద‌ల తేదీని మార్చాల‌ని నిర్ణయించాం. త్వర‌లోనే కొత్త విడుదల తేదీతో మీ ముందుకు వ‌స్తామ‌ని ఆశిస్తున్నాం." అని చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

ఇక కరోనా ప్రభావం వలన ఇప్పటికే పలు రాష్ట్రాలు అలెర్ట్ అయి స్కూల్స్, సినిమా ధియేటర్స్ మొదలగు వాటిని కొద్దిరోజులు మూసివేస్తున్నట్టుగా ప్రకటించాయి. దీనితో తెలుగులో నాని v సినిమాతో పాటు మొదలగు సినిమాలు వాయిదాని వేసుకున్నాయి.. ఇక చిత్రపరిశ్రమ కూడా షూటింగ్ లను కూడా వాయిదా వేసుకున్నాయి..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories