నయన్ విషయంలో తీవ్రంగా రియాక్ట్ అయిన రానా

Ruthvik
Published on: 26 March 2019 4:01 PM IST
నయన్ విషయంలో తీవ్రంగా రియాక్ట్ అయిన రానా
X

ఈమధ్యనే సీనియర్ నటుడు రాధారవి హీరోయిన్ నయనతార పై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో దుమారం లేపుతున్న సంగతి తెలిసిందే. కొందరు సీత లాగా నటిస్తారు మళ్ళీ దెయ్యంగా కూడా నటిస్తారు, నయన్ ని చూస్తే దెయ్యాలు కూడా పారిపోతాయి అంటూ ఆమెను బాగా అవమానించాడు. దీనిపై ఇప్పటికే సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి విరుచుకుపడింది. తన విషయంలో అందరూ కామ్ గా ఉన్నారని, ఇప్పుడు నయన్ నడిగర్ సంగంలో సభ్యురాలు కాబట్టి అందరూ ఖండించాలని కోరింది.

మరోవైపు వరలక్ష్మి శరత్ కుమార్, తాప్సి, రాధిక శరత్ కుమార్, విశాల్ తదితరులు కూడా రాధారవి వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి కూడా స్పందించాడు. "ఇప్పుడే Mr. రాధారవి ఒక అద్భుత నటి గురించి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల గురించి విన్నాను. సర్ మీ వ్యక్తిత్వం లో ఉండే మాలిన్యాన్ని మీ కామెంట్స్ చూపిస్తున్నాయి. నయన్ అద్భుత నటన సంగతి కూడా మీ వ్యాఖ్యల్లో తెలుస్తోంది. #రాధారవి గారు మీరు ఈ కమ్యూనిటీ కే అవమానం" అంటూ రాధారవిపై మండిపడ్డాడు.


Ruthvik

Ruthvik

Next Story