Rana - Nani: ఈ సినిమా కోసం రానా నానిని రికమెండ్ చేశారట

Rana Daggubati Recommended Nani for Shyam Singha Roy Movie
x
రానా - నాని (ఫైల్ ఫోటో)
Highlights

* "శ్యామ్ సింగరాయి" సినిమా నాని కంటే ముందు ఈ హీరోకి వెళ్లిందట

Rana - Nani: కొన్నిసార్లు ఒక హీరో కోసం అని రాసిన కథ వేరొక హీరో చేతికి వెళ్లి పడుతూ ఉంటుంది. ఇలా ఇలా చేతులు మారి ఆఖరిగా ఒక హీరో వద్ద ఆగిన సినిమాలు మనం చాలానే చూశాం. తాజా సమాచారం ప్రకారం నాని హీరోగా నటిస్తున్న "శ్యామ్ సింగరాయి" సినిమా కూడా అలాంటిదే.

ఈ సినిమాకి "టాక్సీ వాలా" ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమా కథని ముందుగా రానా దగ్గుబాటి కి నేరెట్ చేశారట. ఈ సినిమాలో రానా హీరోగా చేస్తే బాగుంటుందని ఆయన ముందుగా రానా ను సంప్రదించారు.

కథ ఉన్నప్పటికీ రానా తను ఆ కథకి సెట్ అవ్వనని, నాని అయితే బాగుంటుందని సజెస్ట్ చేశాడట. రానా రికమండేషన్ తర్వాతే ఈ సినిమాని కథని నానికి వినిపించారు రాహుల్ సాంకృత్యాయన్. కథ విన్న వెంటనే నాని ఈ సినిమాకి ఓకే చెప్పారు. అలా రానా దగ్గరికి వెళ్లిన కథ ఆఖరికి నాని చేతుల్లోకి వచ్చింది.

కృతి శెట్టి, సాయిపల్లవి మరియు మడోన్నా సెబాస్టియన్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలావరకు కోల్కతా, వెస్ట్ బెంగాల్ లో జరిగింది. నిహారిక ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణాంతర పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories