'అరణ్య'లో గర్జిస్తున్న రానా.. 'హాథీ మేరే సాథీ' లుక్ అదిరిపోయింది

అరణ్యలో గర్జిస్తున్న రానా.. హాథీ మేరే సాథీ లుక్ అదిరిపోయింది
x
రానా మూవీ
Highlights

దగ్గుబాటి వారసుడిగా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన రానా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు హీరోగాను మరోవైపు విలన్ గా నటిస్తూ...

దగ్గుబాటి వారసుడిగా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన రానా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు హీరోగాను మరోవైపు విలన్ గా నటిస్తూ సత్తాచాటుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో భళ్లాలదేవుడు రానా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నుంచి విభిన్న పాత్రలు ఎంచుకుంటున్నారు. ఇక రానా తాజాగా నటించిన బహు భాషా చిత్రం 'హాథీ మేరే సాథీ' ఫస్ట్ ‌లుక్‌ను విడుదల చేసింది. కాగా.. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్‌ విడుదల చేశారు.

ఈ సినిమా తెలుగు తమిళ హిందీ బాషల్లో రుపొందిస్తు్న్నారు. తెలుగులో 'అరణ్య' తమిళంలో 'కాదన్‌' హిందీలో 'హాథీ మేరే సాథీ', గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. హిందీలో ఈ సినీమాకు సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు. మానవులు-జంతువుల ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రానా అడవిలో నివసించే ఆదివాసి 'బన్ దేవ్' పాత్రలో నటిస్తున్నారు.

మంగళవారం విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో పెరిగిన గెడ్డంతో ఒళ్లంతా గాయాలతో అడవి జంతువుల మద్య రానా ఉగ్ర రూపం‎తో రానా కలిపిస్తారు. ఈ సినిమాలో జోయా హుస్సేన్‌, శ్రియా పిల్లావుంకర్‌, విష్ణు విశాల్‌, పుల్‌కిత్‌ సామ్రాట్‌ పలువురు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్‌ విజేత రసూల్‌ సౌండ్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ప్రభు సోలోమాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా... ఈ సినిమా మూడు భాషల్లో ఏప్రిల్‌ 2న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories