రానా "విరాట పర్వం" సినిమాని మర్చిపోయారా..?

Rana Daggubati and Suresh Productions Silent on Virata Parvam Movie | Sai Pallavi | Live News
x

రానా "విరాట పర్వం" సినిమాని మర్చిపోయారా..?

Highlights

Rana Daggubati: రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన పీరియడ్ డ్రామా విరాటపర్వం...

Rana Daggubati: రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన పీరియడ్ డ్రామా విరాటపర్వం ఇప్పటికీ విడుదలకి నోచుకోలేకపోతుంది. రెండేళ్లకు పైగా షూటింగ్ లోనే ఉన్న ఈ చిత్రం 2021 లోనే విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ ఈ సినిమా 2022 కి వాయిదా పడింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు.

సినిమా టీజర్ విడుదలై ఇప్పటికీ సంవత్సరం గడిచింది కానీ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ కూడా దర్శకనిర్మాతలు ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు. ఇక ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కోసం మంచి విడుదల తేదీ కూడా దొరికే పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో రానా హీరోగా విడుదలైన అరణ్య మరియు 1945 సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.

మంచి అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే రానా "విరాటపర్వం" సినిమా విషయంలో ఇలాంటివి జరగకుండా సినిమాని డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా గురించి రానా మరియు సురేష్ ప్రొడక్షన్స్ వారు మౌనంగా ఉండటం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories