రానా సినిమా ఆగిపోలేదట.. ఆ సినిమాపైన క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

rana
x
rana
Highlights

రానా సినిమాల్లో కనిపించక చాలా రోజులు అవుతుంది. ఆరోగ్య సమస్యల కారణంగా రానా ప్రస్తుతం సినిమాలకి బ్రేక్ ఇచ్చుకుంటూ వచ్చాడు . అయితే అందులో భాగంగా...

రానా సినిమాల్లో కనిపించక చాలా రోజులు అవుతుంది. ఆరోగ్య సమస్యల కారణంగా రానా ప్రస్తుతం సినిమాలకి బ్రేక్ ఇచ్చుకుంటూ వచ్చాడు . అయితే అందులో భాగంగా దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశ్యప అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. రానా ఆరోగ్య సమస్యల కారణంగా హిరణ్యకశ్యప లాంటి భారీ సినిమాని చేయగలుగుతాడా అన్న అనుమానం కలిగింది. అంతేకాకుండా ఆ సినిమా ఆగిపోయింది అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాపైన అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు గుణశేఖర్..

సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది అన్న విషయం పక్కన పెడితే సినిమా స్క్రిప్ట్ వర్క్ పనులు కోసం కసరత్తులు పెడుతున్నట్లు గుణశేఖర్ తన సోషల్ మీడియాలో తెలిపాడు. " సహాయ దర్శకులు : తెలుగు భాష పై పట్టు, తెలుగు సాహిత్యం పై అవగాహన కలిగిఉన్న వారు మీ వివరములతో వెంటనే సంప్రదించండి అంటూ పోస్ట్ పెట్టాడు గుణశేఖర్..

అయితే గుణ శేఖర్ హిరణ్యకశ్యప సినిమా కోసమే ఈ అనౌన్స్ మెంట్ చేసారన్న టాక్ నడుస్తుంది. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తుంది. రుద్రమదేవి సినిమా తర్వాత గుణ శేఖర్ మళ్ళీ సినిమాలు చేసింది లేదు. అ సినిమాలో రానా చాళుక్య వీరభద్రుడు పాత్రలో కనిపించి మెప్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories