Bigg Boss 5: కమల్ హాసన్ స్థానంలో హోస్ట్ గా మారనున్న రమ్యకృష్ణ

* బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించనున్న రమ్య కృష్ణ * అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు.

admin1
Published on: 28 Nov 2021 8:15 AM IST
Ramya Krishnan to Host Bigg Boss 5 Instead of Kamal Haasan in Tamil
X

బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించనున్న రమ్య కృష్ణ(ఫైల్ ఫోటో)

Bigg Boss 5: తెలుగు బిగ్ బాస్ తో పాటు తమిళంలో కూడా బిగ్బాస్ సీజన్ 5 రన్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదటి నాలుగు సీజన్లలను హోస్ట్ చేసిన కమల్ హాసన్ ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మధ్యనే అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన కమల్ హాసన్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.

దీంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కమల్ హాసన్. కాబట్టి కమల్ హాసన్ ఒక ఒకటి లేదా రెండు వారాలపాటు బిగ్ బాస్ హోస్ట్ చేయలేకపోతున్నారు. దీంతో దర్శక నిర్మాతలు కమల్ హాసన్ స్థానంలో మరొక సెలబ్రిటీ ని హోస్ట్ గా రంగంలోకి దింపారు.

ముందుగా శ్రుతిహాసన్ హోస్ట్ గా తీసుకురానున్నారు అని వార్తలు వినిపించాయి కానీ తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ బదులు ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.

గతంలో తెలుగు బిగ్బాస్ సీజన్ 3 అప్పుడు నాగార్జున ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్ళినప్పుడు రమ్యకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించారు. దీంతో ఇప్పటికే బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించిన అనుభవం ఉండడంతో తమిళ్ బిగ్ బాస్ కి కూడా ఈమెనే రంగంలోకి దింపారు. ఇక సినిమాల పరంగా రమ్యకృష్ణ తెలుగులో నాగార్జున సరసన "బంగార్రాజు" సినిమాలో నటిస్తున్నారు.

admin1

admin1

Next Story