క్వీన్ ట్రైలర్ : రమ్యకృష్ణపై ప్రశంసల వెల్లువ

క్వీన్ ట్రైలర్ : రమ్యకృష్ణపై ప్రశంసల వెల్లువ
x
Ramya krishna Queen movie
Highlights

ప్రస్తుతం ఏ సినీఇండస్ట్రీలోనైనా బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. కాగా తలైవి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిజ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రూపొందిన...

ప్రస్తుతం ఏ సినీఇండస్ట్రీలోనైనా బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. కాగా తలైవి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిజ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. తలైవి అనే చిత్రంలో జయలలిత పాత్రను కంగనా రనౌత్ పోషిచించిన సంగతి తెలిసిందే. దర్శకురాలు ప్రియదర్శిని ఐరన్‌ లేడీలో నిత్యా మీనన్‌ జయలలిత పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా జయలలిత జీవిత కథ నేపథ్యంలో క్వీన్ అనే ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.

ఈ వెబ్ సిరీస్ లో జయలలిత పాత్రను సినీయర్ నటి రమకృష్ణ పోషించారు. ఈ వెబ్ సిరీస్ ను గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహింస్తున్నారు. ఇప్పటికే విడుదలైనా ఈ సిరీస్‌ ఫస్ట్ లుక్, టీజర్ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రమ్యకృష్ణ జయలలిత పాత్రలో ఒదిగిపోయారు. క్వీన్ ట్రైలర్ ను డైరెక్టర్ విడుదల చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ అద్భుతంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. ఈ నెల 14న వెబ్ సిరీస్ విడుల చేయనున్నట్లుగా ముందుగానే ప్రకటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్లో ‎రమ్యకృష్ణ పేరు శక్తి శేషాద్రి. జయలలిత చిన్నతనం నుంచి రాజకీయ ప్రస్థానం వరకూ సాగిన సన్నీవేశాలను గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించారు.జయలలిత పాత్రలో కంగనా రనౌత్ కంటే రమ్యకృష్ణ ఒదిగిపోయారని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories