సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో ఇబ్బంది పడ్డా.. కానీ !

సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో ఇబ్బంది పడ్డా.. కానీ !
x
Soundarya, Ramyakrishna (File photo)
Highlights

అందం, అభినయంతో ఆకట్టుకోగల నటి రమ్యకృష్ణ.. మొదట్లో ఐరన్ లెగ్ అని ముద్రపదినప్పటికి ఆ తర్వాత విజయవంతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అందం, అభినయంతో ఆకట్టుకోగల నటి రమ్యకృష్ణ.. మొదట్లో ఐరన్ లెగ్ అని ముద్రపదినప్పటికి ఆ తర్వాత విజయవంతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో నటించింది రమ్యకృష్ణ.. కేవలం హీరోయిన్ గానే కాకుండా పవర్ ఫుల్ పాత్రలలో కూడా నటించి తనకు తానే సాటి అని నిరూపించుకుంది రమ్యకృష్ణ.. బాహుబలిలో శివగామీ పాత్రలో నటించి ఆ సినిమా సక్సెస్ కి మెయిన్ పిల్లర్ గా నిలిచారు.

అయితే ఈ రమ్యకృష్ణకి ముందుగా నటిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం నరసింహ... రజినీకాంత్, సౌందర్య హీరోహీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ నిలంబరి అనే పవర్ ఫుల్ పాత్రలో నటించింది. రజినీకాంత్ కి ఎక్కడ కూడా తగ్గకుండా ఆమె నటన ఈ సినిమాలో ఉంటుంది. అయితే ఈ సినిమాలోని నీలాంబరి పాత్రను ముందుగా చేయొద్దు అని అనుకున్నారట రమ్యకృష్ణ.. దర్శకుడి బలవంతం మేరకే ఆ పాత్రకి ఒప్పుకున్నట్లు రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఒకవేళఆ సినిమాలో నీలాంబరి పాత్ర కావాలా లేకా సౌందర్య పాత్ర కావాలా అని తనను దర్శకుడు అడిగి ఉంటే తాను కచ్చితంగా సౌందర్య పాత్రనే ఎంచుకునేదాన్నని రమ్యకృష్ణ వెల్లడించింది. అంతేకాకుండా ఈ చిత్రంలో నేను సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిపడ్డానని, కానీ దర్శకుడిని నమ్మి ఆ సన్నివేశం పూర్తి చేయగలిగానని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది. ఈ సినిమా తరవాత రమ్యకృష్ణ స్టార్ ఇమేజ్ మరింతగా పెరిగింది. వరుస అవకాశాలు ఆమెకి వచ్చాయి.

ప్రస్తుతం రమ్యకృష్ణ తన భర్త కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగమార్తండ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రకాష్ రాజ్ మరో పాత్రలో నటిస్తున్నాడు. ఇక తెలుగు, తమిళ భాషలలో మరికొన్ని చిత్రాలలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories