కేటీఆర్.. మీ బాక్సింగ్ పంచ్‌కు నా ముక్కు పగిలింది: ఆర్జీవీ

కేటీఆర్.. మీ బాక్సింగ్ పంచ్‌కు నా ముక్కు పగిలింది: ఆర్జీవీ
x
Ramgopal Varma, KTR (File Photo)
Highlights

నిత్యం ఏదో ఇష్యూతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..

నిత్యం ఏదో ఇష్యూతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా #AskKTR నిర్వహించిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ మద్యం సరఫరా గురించి ప్రశ్నించారు..పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల అక్కడి ప్రభుత్వం మద్యాన్ని డోర్ డెలివరీ చేసేలా నిర్ణయం తీసుకున్నదని వర్మ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ట్వీట్ ని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ కోరిక కోరారు.

"మీకు నాదో విన్నపం. ఎవరైతే బోర్‌గా ఫీలవుతూ జుట్టు పీక్కుంటున్నారో, చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నారో, మెంటల్ ఆస్పత్రుల్లో చేరుతున్నారో, వీరి కోసం మమతా బెనర్జీ లాంటి పెద్ద మనస్సు ఉండాలి. అలాంటి పద్ధతినే ఇక్కడ కూడా ప్రవేశపెట్టండి" అని వర్మ పేర్కొన్నారు.. అయితే దీని పైన మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు.. 'రామూ గారూ.. హెయిర్‌ కట్‌ గురించే అడుగుతున్నారు కదా' అంటూ రిప్లై ఇచ్చారు.

కేటీఆర్ ఇచ్చిన రిప్లై కి రాంగోపాల్ వర్మ స్పందించాడు..

"కేటీఆర్ గారూ మీ సమాధానాన్ని మిస్ అయ్యాను. మీ సమయస్ఫూర్తి నచ్చింది. దాన్ని ఓ స్టీలు బాక్సులో పెట్టి నా ముక్కుపై గట్టిగా బాక్సింగ్ పంచ్ ఇచ్చినట్లయింది. దీంతో నా ముక్కు ఎర్రగా మారింది. కానీ, ప్రస్తుతం మీ ప్రభుత్వం చేస్తున్న పనులు చాలా బాగున్నాయి" అంటూ పేర్కొన్నాడు.. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories