Ramesh Varma: ఇద్దరు సమానమే అంటున్న రమేష్ వర్మ

ఇద్దరు సమానమే అంటున్న రమేష్ వర్మ
Ramesh Varma: 15 నిమిషాల్లో ఓకే చేసేశారు అంటున్న రమేష్ వర్మ
Ramesh Varma: ఒక్క సినిమాతో దర్శకుడిగా మారిన రమేష్ వర్మ కెరీర్ మొదటి రోజుల్లో చాలా వరకు డిజాస్టర్ ను అందుకున్నారు. 2019లో మొదటిసారిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన "రాక్షసుడు" సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న రమేష్ వర్మ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ తో "ఖిలాడి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మధ్యనే క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ఈ సినిమాలో ఒక సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర వేడుకలో మాట్లాడుతూ రమేష్ వర్మ ఈ కథ రవితేజ కి చాలా బాగా నచ్చిందని, కథ చెప్పిన వెంటనే రవితేజ ఎటువంటి ఆలస్యం చేయకుండా కేవలం ఒక 15 నిమిషాల్లోనే ఓకే చేసేశారు అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరీలు ఇద్దరి పాత్రలు కథకి చాలా ఇంపార్టెంట్ అని ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే పాత్రలు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు రమేష్ వర్మ.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT