Ramcharan: అభిమానులకు రాంచరణ్ రిక్వెస్ట్.. నాకు ఇచ్చే గిఫ్ట్ అదే.

Ramcharan: అభిమానులకు రాంచరణ్ రిక్వెస్ట్.. నాకు ఇచ్చే గిఫ్ట్ అదే.
x
Ramcharan
Highlights

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ 35వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు సన్నిహితుల నుంచి శుభాకాంక్షలతో ముంచెత్తారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ 35వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు సన్నిహితుల నుంచి శుభాకాంక్షలతో ముంచెత్తారు.మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ 35వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు సన్నిహితుల నుంచి శుభాకాంక్షలతో ముంచెత్తారు.దీంతో వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

గురువారం అర్ధాత్రి నుంచి తనకు ఎంతో మంది సన్నిహితులు, అభిమానులు ఫోన్ చేసి విషెస్ తెలియజేసినట్టు చెప్పుకొచ్చారు. అందరినీ అమితంగా ప్రేమిస్తున్నా... అంతేకాకుండా అభిమానులు అందరూ తన పుట్టినరోజున .. బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి కరోనా మహామ్మారిపై పోరాడాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు అందరూ ఇళ్లలోనే వుండాలని కోరుతూ ట్వీట్ చేశారు.

రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటోను చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'RRR'(రౌద్రం రణం రుధిరం).

ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. రామ్‌చరణ్‌కి జోడీగా ఆలియాభట్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఉగాది పర్వదినం సందర్భంగా టైటిల్‌ లోగోతో పాటు, మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. టైటిల్‌ లోగోతో పాటు, మోషన్‌ పోస్టర్‌ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

ఈ నేథ్యంలో 'బీమ్‌ ఫర్‌ రామరాజు' పేరుతో వీడియోను విడుదల చిత్ర బృందం చేసింది. తెలుగు వీడియోను డీవీవీ మూవీస్‌, తమిళ్‌ను జూ.ఎన్టీఆర్‌, హిందీ అజయ్‌దేవగణ్‌, కన్నడ వారాహి, మలయాళం రామ్‌చరణ్‌ల సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకోనున్నారు.

ఇవాళ (శుక్రవారం) రామ్‌చరణ్‌ జన్మదినం సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. 10 గంటలకు డిజిటల్‌ వేదికగా సర్‌ప్రైజ్‌ ఇస్తానని ఎన్టీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిిందే.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories