Rambha: తిరిగి రావ‌డానికి వాళ్లే కార‌ణం.. రంభ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Rambha Opens Up About Her Comeback Family Support, Fear, and Love for Acting
x

Rambha: తిరిగి రావ‌డానికి వాళ్లే కార‌ణం.. రంభ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Highlights

Rambha: సినీ పరిశ్రమలో 1990ల దశకంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార రంభ, చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి రావాలని సీరియస్‌గా ఆలోచిస్తున్నారు.

Rambha: సినీ పరిశ్రమలో 1990ల దశకంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార రంభ, చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి రావాలని సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. 15 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న రంభ, ప్రస్తుతం ఓ టీవీ రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ మరోసారి ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, సినిమాలపై మళ్లీ పుట్టిన ఆసక్తి గురించి వివరించారు.

నా పిల్లలకు తల్లిగా పూర్తి సమయాన్ని కేటాయించాలనే ఆలోచనతోనే ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపిన రంభ.. తన కుమార్తెలు 14, 10 సంవత్సరాలు, మా చిన్నబ్బాయి 6 ఏళ్ల వయసులోకి వచ్చారు. వారు ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు. ఈ దశలో నేను మళ్లీ నా అభిరుచుల వైపు దృష్టిసారించాల‌ని అనిపించింద‌ని తెలిపారు. తన భర్తకు తాను నటనను ఎంతగా ప్రేమిస్తానో తెలుసని, ఆయనే ఈ షో ఆఫర్ వచ్చినప్పుడు 'ఈ అవకాశం మిస్ కాకు' అంటూ ప్రోత్సహించారు. కుటుంబం నుంచి వచ్చిన ఈ మద్దతే నాకు తిరిగి తెరపై క‌నిపించ‌డానికి ప్రేరణ ఇచ్చిందని చెప్పుకొచ్చింది.

ఇక చాలా కాలం త‌ర్వాత స్క్రీన్‌పై క‌నించిన రంభ ఆ స‌మ‌యంలో ఎదురైన ఓ సంఘ‌ట‌న గురించి పంచుకుంది. "ఇటీవల రియాలిటీ షోలో భాగంగా స్టేజ్‌పై డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఆ దృశ్యం నన్ను మళ్లీ నా మొదటి సినిమా రోజుల్లోకి తీసుకెళ్లింది. అప్పట్లో ఎలా బెదరిపోయానో ఇప్పుడు కూడా అలాగే అనిపించింది. వ్యాన్ నుంచి కింద దిగడానికి కూడా కొంత తడబడిపోయాను. కానీ స్టేజ్‌పై అడుగుపెట్టి, ప్రేక్షకుల నుంచి చప్పట్లు వినగానే ఆ భయం పోయింది. ఒక్కసారిగా 30 ఏళ్ల క్రితం జరిగిన మంత్రం మళ్లీ జరిగిందనిపించింది అని తెలిపింది.

ఇక న‌ట‌న త‌న ర‌క్తంలోనే ఉంద‌న్న రంభ‌.. "ఇటీవల ఓ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు అక్కడి అభిమానుల నుంచి వచ్చిన ఆదరణ చూసి నిజంగా గర్వంగా అనిపించింది. వాళ్ల ప్రేమను చూసిన తర్వాతే నటన పట్ల నా ప్రేమను మళ్లీ గుర్తించాను. నటించడమంటే నేను నేర్చుకున్న విద్య కాదు, అది నాలో కలిసిపోయిన భాగం. నాతో పాటు వచ్చిన చాలామంది ఇప్పటికీ నటిస్తున్నారు. నాలో ఇంకా నటనకు స్థానం ఉందని నమ్ముతున్నాను. అందుకే మళ్లీ వెండితెరపై నా ప్రస్థానాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. మ‌రి రంభ రీఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories